Tension arose at Nakka Anand Babu House in Guntur మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద అర్థరాత్రి ఉద్రిక్తత

Tension arose at nakka anand babu house amid police officials notices

High Tension at Nakka Anand babu house, Police try to issue notices to Nakka Anand babu, AP Police on Nakka Anand Babu Ganja comments, Former Minister, Nakka Ananda Babu, High Tension, Ganja availability, Guntur, Visakhapatnam police, Andhra pradesh, Politics. crime

Tension prevailed at Former Minister Nakka Anand Babu House in Guntur as Visakhapatnam police reached his House at Guntur and tried to serve notices to him on his allegations, stating that ganja is available maximum number of districts in the state.

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద అర్థరాత్రి ఉద్రిక్తత

Posted: 10/19/2021 12:09 PM IST
Tension arose at nakka anand babu house amid police officials notices

రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా ఎదుట ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన విశాఖపట్టణం పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు గత అర్ధరాత్రి గుంటూరు వచ్చారు. విశాఖ పోలీసుల రాక నేపథ్యంలో ఆనంద్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు అందించే ప్రయత్నం చేశారు.

గంజాయి ఏయే ప్రాంతాల్లో లభ్యం అవుతుందో ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ నేత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క విశాఖలోనే కాదని,  రాష్ట్రం మొత్తం గంజాయి దొరుకుతోందని అన్నారు. గుంటూరులోనూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. నల్గొండ జిల్లా పోలీసులు వచ్చి, నాలుగు రోజులు ఏపీలో ఉన్నారని, వారికి సమాచారం అందింది కాబట్టే వారు ఇక్కడకు వచ్చి నిఘా పెట్టారని అన్నారు. ఇలాంటి ఘటనలపై ఓ మాజీ మంత్రిగా తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.

అయితే ఆధారాలు చూపాలని పోలీసులు పేర్కోనగా.. వాటిని సమకూర్చే పని తనది కాదని.. వాటిని వెతికి పట్టుకోవాల్సిన పని పోలీసులదని ఆయన అన్నారు. రాష్ట్రంలో సరికొత్త విధానాన్ని డీజీపీ తెరపైకి తెచ్చారని, ప్రతిపక్ష నేతలు కొత్త అంశాల గురించి మాట్లాడితే వెంటనే నోటీసులు ఇస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు ఏదీ మాట్లాడినా దానికి సాక్ష్యాలను, ఆధారాలను తామే చూపాలని పోలీసులు చెప్పడం హాస్యస్పదంగా వుందని అన్నారు. సాక్ష్యాలను, ఆధారాలను టీడీపీ నేతలే సమకూర్చితే ఇక పోలీసులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

అదే సమయంలో ఆనందబాబు ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టాల్సింది పోయి, దానిపై మాట్లాడే వారిని అడ్డుకోవడం దుర్మార్గమని ఆలపాటి మండిపడ్డారు. మాజీ మంత్రి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారన్న వార్త దవనంలా వ్యాపించడంతో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారు వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో నర్సీపట్నం పోలీసులు ఆనంద్ బాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles