టీవీ, సినీ నటి సౌజన్యది ఆత్మహత్యేనని తేల్చారు వైద్యులు. గత నెల 30వ తేదీన అమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో ఒక్కసారిగా అనుమానాలు రేకెత్తాయి. అమెది హత్య అని కొందరు, అత్మహత్య అని కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా వెల్లడైన వివరాల నేపథ్యంలో అమెది ఆత్మహత్యే అని పోలీసులు తెలిపారు. శాండిల్ వుడ్ లో మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న తరుణంలో అమె ఆకస్మాత్తుగా మరణించడంతో ఈ మేరకు అనుమానాలు రేకెత్తాయి. కాగా, పోస్టుమార్టం నివేదికలో అమెది ఆత్మహత్యేనని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.
బెంగళూరులోని కుంబళగోడులోని తన ఇంట్లో గత నెల 30న సౌజన్య విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి పరిశీలించగా అమె గదిలో ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. సౌజన్య ఆత్మహత్య వార్త కన్నడ టీవీ రంగంతో పాటు శాండిల్ వుడ్ పరిశ్రమను కుదిపేసింది. 25 ఏళ్ల సౌజన్యది కొడుగు జిల్లాలోని కుశాల్ నగర్ కాగా వృత్తిపరంగా బెంగళూరులో ఉంటోంది. అనారోగ్యపరమైన సమస్యలతోపాటు టెలివిజన్ రంగంలోనూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆత్మహత్యకు ముందు రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
అయయితే ఈ సూసైడ్ నోట్ కూడా అనుమానాస్పందంగానే ఉండటం అనుమానాలకు తావిచ్చింది. మూడు వేర్వేరు తేదీలతో అంటే సెప్టెంబరు 27, 28, 30 తేదీలలో ఆ నోట్ రాసినట్టుగా ఉంది. అయితే, తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు సౌజన్య స్నేహితుడు వివేక్ ను విచారించారు. కాగా, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తాజాగా నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. సౌజన్య పలు సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more