కేంద్రం స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థలను ప్రయోగించి పలు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలను, మరీ ముఖ్యంగా విపక్ష సభ్యులను టార్గెట్ చేస్తుందన్న విమర్శలు ఈ మధ్యకాలంలో అధికమయ్యాయి. కాగా ముంబైలోని క్రూయిజ్ రేవ్ పార్టీలో బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ పట్టుబడిన తరువాత ఏకంగా దర్యాప్తు సంస్థలే అరోపణలను ఎదుర్కోంటున్నాయి. నాలుగు రోజుల కిందట ఎన్సీబికి చెందిన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీబి అధికారులు ముగ్గురు యువకులను వదిలేశారని, వారికి బీజేపి నేతలతో దగ్గరి సంబంధాలు వుండటమే ఇందుకు కారణమని ఆయన అరోపించారు.
అంతేకాకుండా అర్యన్ ఖాన్ ను డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడేలా చేసేందుకు కుట్ర జరిగిందన్న అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలపై అలాంటి ఘాటు అరోపణలే చేశారు. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతినేలా చేసేందుకు కుట్ర జరుగుతుందని అరోపించారు. సెలబ్రిటీలను పట్టుకుని ఫోటోలు క్లిక్‌మనిపించడంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి అధికమని ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసును ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ పట్టుబడటం మహారాష్ట్రలోనే జరుగుతోందా అని ఆయన నిలదీశారు. ముంబైలోని షణ్ముకానంద్ హాల్‌లో జరిగిన దసరా ర్యాలీలో ఠాక్రే మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.
ముంద్రా పోర్టులో రాష్ట్ర పోలీసులు ఇటీవల రూ 21 వేల కోట్ల విలువైన 3000 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నా కేవలం సెలబ్రిటీల అరెస్ట్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సెలబ్రిటీలను పట్టుకుని వారి ఫోటోలను తీయడంలోనే కేంద్ర దర్యాప్తు సంస్ధలు (ఎన్సీబీ) హడావిడి చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటూ బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష ప్రభుత్వాలను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. హిందుత్వకు బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని, కాషాయ పార్టీ నేతలకు మహాత్మ గాంధీ, వీర్ సావర్కర్‌ల పేర్లు ప్రస్తావించే అర్హత కూడా లేదని ఠాక్రే విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more