teacher kicks student, thrashes him with cane విద్యార్థిని చావగోట్టిన టీచర్ పై కఠిన చర్యలకు కార్తి డిమాండ్

Govt school teacher kicks student thrashes him with cane brutality sparks outrage

Tamil Nadu news, Karthi Chidambaram, Karthi Chidambaram news, Karthi Chidambaram school teacher, teacher thrashes student, teacher kicks boy, student beaten by teacher, Chidambaram crime, Tamil nadu education minister, Tamil Nadu, Crime

Congress MP Karti Chidambaram criticised the brutality inflicted upon the student and demanded action against the teacher. The Congress MP wrote on Twitter: “There is no place for corporal punishment in our school system. Strict action must be taken against the teacher.” He tagged Tamil Nadu Education Minister Anbil Mahesh Poyyamozhi to the tweet.

ITEMVIDEOS: విద్యార్థిని చావగోట్టిన టీచర్ పై కఠిన చర్యలకు కార్తి డిమాండ్

Posted: 10/16/2021 02:12 PM IST
Govt school teacher kicks student thrashes him with cane brutality sparks outrage

ఓ విద్యార్థి తరగతులకు హాజరుకాలేదిని త‌ర‌గ‌తి గ‌దిలో తోటి విద్యార్థుల సమక్షంలో విద్యార్థులందరూ తీవ్ర భయాందోళన చెందేలా ఓ ఉపాధ్యాయ‌డు చావచిత‌గ్గొట్టిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. అయితే మాస్టారు ప్రతి విద్యార్థిపై ఇలానే రెచ్చిపోయి మరీ కర్రలు విరేగిలా.. విద్యార్థుల వంటిపై వాతలు తేలేలా కోడుతున్నాడు. విద్యార్థులు చెప్పిన పాఠాలు సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోయినా.. చెప్పకుండా పాఠశాలకు రాకపోయినా విద్యార్థులు ఈ మాస్టారు క్లాస్ ఉందంటే చాలు తలుచుకుంటేనే ఫ్యాంటు తడుపుకునేలా చేయిస్తారు. ఇక తరగతి గదిలో అందరి విద్యార్థుల ముందు.. వాయించి వదిలిపెడతారు. అయితే అందరి మాస్టారుల్లా ఏదో కర్రతో రెండు చేతులపై కొట్టి ఊరుకోరు.. కర్ర మాత్రమే కాదు మద్యమధ్యలో ఆయన తన కాలిని కూడా వినియోగిస్తుంటారు.

విద్యార్థులంటే చిన్నారులు అని చెప్పాల్సిన మాస్టారే తన వయస్సుకు, బరువుకు భారమైన పనులు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. మాస్టారంటే భయంతో పాఠాలు నేర్చుకోవాలంటే కష్టం.. మాస్టారుపై ఇష్టంతో కష్టమైన పాఠాన్ని కూడా ఇష్టంగా నేర్చుకునేలా చేయాల్సినవారు మాస్టారు అన్న విషయాన్ని ఈయనకు మళ్లీ తరగతి గదికి పంపించి నేర్చించాలో ఏమోమరి. మాస్టారు గారు అఘాయిత్యాలను నిత్యం చవిచూస్తున్న విద్యార్థులు ఆయన విపరీతచర్యల దృశ్యాల‌ను స్మార్ట్ ఫోనులో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌గా, అది వైర‌ల్ అవుతోంది. తమిళనాడులో నిదురై కలియమూర్తి నగర్ ప్రాంతంలో ఉన్న నందనార్ పాఠ‌శాల‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

విద్యార్థి జుట్టు పట్టుకుని, క‌ర్ర‌తో ఉపాధ్యాయుడు కొట్టాడు. అలాగే, కింద పడేసి త‌న్నాడు. ఈ వీడియోను కాంగ్రెస్ నేత చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబరం కూడా తన ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. విద్యార్థులను ఇంత‌లా కొట్టే అధికారం ఏ ఉపాధ్యాయుడికీ లేదని ఆయ‌న అన్నారు. ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కొట్టిన టీచ‌ర్ పేరు సుబ్రహ్మణ్యం అని తెలిసింది. ఏడుగురు విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా హాజరు కావడం లేదని వారంద‌రినీ టీచ‌ర్ కొట్టాడు. వారిలో ఒక విద్యార్థిని కొడుతుండ‌గా మ‌రో విద్యార్థి ఈ వీడియో తీశాడు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచారణ జ‌రుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles