Fuel prices increased because of free Covid vaccines: Union minister ఇంధన దరల పెంపుకు అసలు కారణం ఇదే: కేంద్రమంత్రి

Fuel prices increased because centre spent money on giving free covid vaccines union minister

covid-19, Rameswar Teli, coronavirus vaccination, fuel prices India, petrol price delhi, petrol price Mumbai, BJP Assam, value added tax, Congress, diesel, petrol, petrol prices, Covid-19 vaccines, fuel prices, Free vaccination, petrol prices, petrol tax collections, Union MoS (Petroleum & Natural Gas), Rameswar Teli, Assam, Politics

Union Minister for State of Petroleum and Natural Gas Rameswar Teli said that the fuel prices in the country were high because the government spent money to provide free Covid-19 vaccination to citizens

ఇంధన దరల పెంపుకు అసలు కారణం ఇదే: కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి

Posted: 10/12/2021 01:28 PM IST
Fuel prices increased because centre spent money on giving free covid vaccines union minister

ఇంధన ధరలు ఈ ఏడాది మే నెల 4 నుంచి పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. జూలై నెలలో ఏకంగా అల్ టైమ్ హై దాటిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రతిపక్షాలు భగ్గుమనేలా వున్నాయంటూ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో కొంత వెనక్కు తగ్గిన కేంద్రం.. రెండు నెలల పాటు వాటి జోలికి వెళ్లలేదు. అయితే గత నెలాఖరు నుంచి క్రమంగా పెంచుతూ వస్తోంది. ఈ నెలలో మరోమారు అల్ టైమ్ హై ధరలను తాకిన ఇంధన ధరలు.. ఇక రోజు రోజుకు సరికోత్త గరిష్టాలను తాకుతూ కొత్త ఎత్తులను అందుకోవడంలో పోటీ పడుతున్నాయి.

అయితే పెట్రోల్‌, డీజిల్, గ్యాస్‌ ధరల పెరుగుదలకు అసలు కారణం ఏమిటీ.? అంటే ప్రపంచ మార్కెట్ లో మారుతున్న ఇంధన ధరలకు అనుగూణంగా ఏ రోజుకారోజు ధరల్లో మార్పులను తీసుకురావడంపై అధారపడి వుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అదోక్కటే కాదని.. ఇంధనం గ్యాస్ ధరల పెంపులో మరో కోణం కూడా వుందని తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు కరోనా టీకాలను ఉచితంగా ఇస్తున్నామని.. అయితే వారి నుంచి డబ్బు తీసుకోకుండా.. ఆ డబ్బును వాహనదారుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో పొందుతున్నామని వివరణ ఇచ్చారు.

దేశంలో ఇంధనధరలు తక్కువగా ఉన్నాయన్న ఆయన.. వాటికి కేంద్రం ఎక్సైజ్ సుంకంతో పాటు రాష్ట్రాల పన్నులు కూడా కలిపిన తరువాత.. భారంగా మారుతున్నాయని అన్నారు. ‘మీరు తప్పనిసరిగా ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనికి డబ్బులు ఎక్కడ నుండి వస్తుంది? మీరు డబ్బు చెల్లించలేదు. అందుకే ఇలా సేకరిస్తున్నాం’ అని కేంద్ర మంత్రి తెలి వ్యాఖ్యానించారు. అస్సాంలో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఉచితంగా టీకా పొందుతున్నందునే వ్యాక్సిన్ల కొనుగోలు డబ్బులను పెట్రోల్‌ పన్నుల రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles