Three terrorists killed in encounter in J-K's Shopian జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Three let terrorist killed in encounter with security forces in shopian in j k

Three LeT terrorist dead, three terrorist dead, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, shopian encounter, rakhama encounter, CRPF forces, Jammu and Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, LeT terrorists killed, Shopian, Jammu and Kashmir, National politics

At least three LeT terrorists were killed on Tuesday during an encounter in Jammu and Kashmir's Shopian. The police also recovered arms and ammunition and other incrimination materials from the three terrorists of Lashkar-e-Taiba (LeT)/The Resistance Front (TRF).

జమ్మూలోని షోపియాన్ లో భీకర ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం..

Posted: 10/12/2021 11:32 AM IST
Three let terrorist killed in encounter with security forces in shopian in j k

జ‌మ్ముక‌శ్మీర్‌లోని షోపియాన్ లో భీకర ఎన్ కౌంటర్ జరిగింది. భారత అర్మీకి చెందిన మేజర్ సహా ఐదుగురు జవాన్ల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాదులు మరణానికి భారత భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. గత రాత్రి నుంచి ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున భ‌ద్ర‌తా బ‌ల‌గాలకు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహా ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను ఆర్మీ బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి.

హతులైన ముగ్గురిలో ఒక‌రిని గుర్తించిన పోలీసులు అతడ్ని ముఖ్త‌ర్ షాగా పేర్కోన్నారు. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారత్ లో భారీ ఉగ్రదాడి జరిపేందుకు వీరు ప్రణాళికలను రచించి భారీగా ఆయుధాలు, పేలు పదార్థాలను సేకరించారని భారత బలగాలు అనుమానిస్తున్నాయి. వీరని భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో వీరి ఉగ్రచర్య ప్రణాళికలకు తాత్కాలికంగా బ్రేకులు పడినట్టే. కాగా భద్రతా బలగాల సర్చ్ అపరేషన్ ఇంకా కోనసాగుతూనే వుంది. షోపియాన్ జిల్లాల్లోని మరికొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో బలగాలు అన్వేషణ కొనసాగిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J-K Police  encounter  jammu kashmir  shopian  militant  security forces  terrorist killed  Crime  

Other Articles