SC Asks UP To File Report On Farmers' Killings Tomorrow లఖీంపూర్ ఘటనపై నివేదిక సమర్పించండీ: సుప్రీం

Lakhimpur kheri violence top court asks up to file report on farmers killings tomorrow

UP violence updates, Lakhimpur Kheri violence, CJI NV Ramana, Supreme Court, ShivKumar Tripati, Lakhimpur Kheri, UP Lakhimpur Kheri updates, Lakhimpur Kheri news, Supreme Court, Lakhimpur Violence, UP Violence, UP Violence News, Lakhimpur-Kheri Violence, Lakhimpur kheri protest, Farmer Protest, Priyanka Gandhi, Congress, farmer protest updates, UP Violence Video, Viral Video, Ajay Mishras son, Uttar Pradesh, Crime

Lakhimpur Kheri Incident: The Supreme court has decided to take up the case amid a growing outcry over the Uttar Pradesh police's handling of the investigation, media reports and a letter written to the Chief Justice by two lawyers from the state.

లఖీంపూర్ ఘటన: నివేదిక సమర్పించాలని యోగీ సర్కార్కు ‘సుప్రీం’ ఆదేశం

Posted: 10/07/2021 05:45 PM IST
Lakhimpur kheri violence top court asks up to file report on farmers killings tomorrow

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌ఖీంపూర్ ఖేరీలో రైతుల‌ను వాహ‌నంతో తొక్కుతూ వెళ్లిన ఘ‌ట‌న‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ లో ముందున్న వాహనాన్ని అక్కడి రైతులు అడ్డుకున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పర్యటన వివరాలు తెలుసుకున్న రైతులు ఆయనను అడ్డుకోగా, ముందున్న వాహనం మాత్రం రైతులను తొక్కేసుకుంటూ ముందుకు కదిలింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందగా, అనంతర అల్లర్లలో నలుగురు మరణించారు.

ఎనమిది మంది మరణానికి దారితీసిన ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లఖీంపూర్ ఖేరీ ఘటనపై విచారణ సందర్భంగా మృతులు ఎవరు.? వారి వివరాలేంటి.? అని అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ ఎన్వీ రమణ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వపు న్యాయవాదికి ప్రశ్నలు సంధించారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వయ్ తొక్కుకుంటా వెళ్లడంతో నలుగురు రైతులు మరణించడంపై శివకుమార్ త్రిపాఠి అనే న్యాయవాది.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.

దీంతో ఇవాళ ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. శుక్రవారంలోగా ఘటనపై దర్యాప్తు స్థితిని తెలియజేస్తూ నివేదికను సమర్పించాలని సీజేఐ జస్టిస్ రమణ ఆదేశించారు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వపు న్యాయవాదిని అదేశించారు. ఈ సందర్భంగా ఆయన చనిపోయిన 8 మంది ఎవరు? వారి వివరాలేంటి? స్పష్టంగా చెప్పాలన్నారు. ఎవరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారో వివరించాలన్నారు. ఘటనకు సంబంధించి రెండు ఎప్ఐఆర్ లు నమోదు చేశామని ఇప్పటికే పోలీసులు తెలిపారు. నలుగురు రైతులు మరణించడంపై ఒక ఎఫ్ఐఆర్, ఆనంతర అల్లర్లపై మరో ఎప్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు ఇదివరకే తెలిపారు.

అయితే, ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. దీనిపై స్పందించిన సీజేఐ.. అసలు ఎఫ్ఐఆర్ లే సరిగ్గా లేవని, దర్యాప్తు సరైన క్రమంలో సాగట్లేదన్నదే పిటిషనర్ ఆందోళన అని అన్నారు. ఘటనలో ఓ రైతు చనిపోయాడని, అతడి తల్లి ఆసుపత్రిలో ఆరోగ్యం విషమించి చికిత్స పొందుతోందంటూ కోర్టు విచారణ సందర్భంగా మెసేజ్ వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆమె వైద్య ఖర్చులన్నీ యూపీ ప్రభుత్వమే భరించాలని ఆదేశించారు. కాగా లఖింపూర్ ఖేరీ ఘటన అనంతర అల్లర్లలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్, ఓ జర్నలిస్టును కొందరు రైతులు కొట్టి చంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles