Heroine Faria Abdullah Dance On Road నడిరోడ్డుపై చీరకట్టులో ఫరియా అబ్దుల్లా మాస్ డాన్స్

Jathi ratnalu heroine faria abdullah maas dance on theenmar band

Jathi Ratnalu Heroine, Heroine Faria Abdullah, Heroine Faria Abdullah dance, Heroine Faria Abdullah teenmaar dance, Heroine Faria Abdullah dance on Road, Heroine Faria Abdullah dance in saree, Heroine Faria Abdullah Maas Dance Beat, Heroine Faria Abdullah Theenmar Band, viral video

Jathi Ratnalu Heroine Faria Abdullah had shakened her legs to the Maas Dance Beat On Theenmar Band on Hyderabad Road. This Post went viral in just minutes

ITEMVIDEOS: నడిరోడ్డుపై చీరకట్టులో ఫరియా అబ్దుల్లా మాస్ డాన్స్

Posted: 10/07/2021 04:20 PM IST
Jathi ratnalu heroine faria abdullah maas dance on theenmar band

చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిదంటే గుండె ఖలాసే.. అన్న పాటలోని చిట్టి మీకు గుర్తుందా.? అవును నవీన్ పోలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహెల్ రామకృష్ణ అతని చిన్ననాటి మిత్రులగా కలసి నటించిన చిత్రమేగా.. కూటి కోసం కూలి కోసం పట్టణానికి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అన్న లైన్ ను తీసుకుని.. దానిని తనదైన కామెడీతో జోడించిన ఈ చిత్రం పేరు జాతిరత్నాలు. ఇక ఈ చిత్రంలోని హీరోయిన్ చిట్టి అలియాస్ ఫిరాయ అబ్దుల్లా కూడా మాకు తెలుసు అంటారా. అమ్మో ఆగండాగండీ. మిమల్ని వదిలితే చిత్రంలోని స్టోరీ, డైలాగులు కూడా చెప్పేలా వున్నారుగా.

ఈ చిత్రం యంగస్టర్స్ ను ఎంతగానో అకర్షించుకుంది. అందుకనే ఎంతో పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లాకు  జాతిరత్నాలు సినిమా కలిసోచ్చింది. ఇక ఈ బ్యూటీ ఇటు గ్లామర్‌ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. అంతేకాదు హైదరాబాదీ యువతతో పాటు తెలుగు రాష్ట్రాల కుర్రకారు మనసుల్ని దోచేసింది. ద్‌కు చెందిన ఈ లోకల్‌ బ్యూటీ మొదటి చిత్రంతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ఇక జాతిరత్నాలు సినిమా అనంతరం ఇప్పటివరకు నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయని ఫరియా ఢీ సీక్వెల్ లో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అందరి హీరోయిన్ల మాదిరిగానే ఈ బ్యూటీ కూడా సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్ట్‌ ఫోటోషూట్‌లు, వీడియోలతో నెట్టింట హల్ చల్‌ చేస్తుంది. తాజాగా నడిరోడ్డుపై తీన్మార్‌ స్టెప్పులకు చిందులేసింది ఈ బ్యూటీ. అదేంటి నడిరోడ్డుపై తీన్మార్ బీట్ కు అదరిపోయే డాన్సులేసి.. యువకుల మతిపోగోట్టింది. నువ్వు హీరోయిన్ వమ్మా అంటే.. తీన్మార్ డ్రమ్స్ శబ్దం వస్తుంటే.. న‌న్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. డ్రమ్స్‌ పవర్‌ అదే అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. పట్టుచీరలో చిట్టి డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by Faria Abdullah (@fariaabdullah)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles