Dead body found with winning lottery ticket లాటరీలో విజేతగా నిలిచిన వ్యక్తి నీట మునిగి..

Dead body found with winning lottery ticket worth rs 33 lakh

Gregory Jarvis, jackpot price, winning lottery ticket, Dead body, lottery, Lottery Ticket, Winning Lottery, Viral Story Dead body, Huron County, Canadian province, Ontario, US state of Michigan, Lottery, Lottery Ticket, Winning Lottery, Viral Story

The corpse of a 57-year-old man was discovered swept dead at a beach in Canada on Friday, September 24. Recognised as Gregory Jarvis, the man’s dead body carried a jackpot price – a winning lottery ticket worth $45,000 (over Rs 33 lakh) kept in his wallet.

అదృష్టాన్ని పాతేరేసిన దురదృష్టం: లాటరీలో విజేతగా నిలిచిన వ్యక్తి నీట మునిగి..

Posted: 09/30/2021 08:25 PM IST
Dead body found with winning lottery ticket worth rs 33 lakh

‘అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు..దురదృష్టం వచ్చి లిప్ కిస్ పెట్టి వెళ్ళిపోయింది’అని ఓ సినిమాలో చెప్పించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ ఈ ఘటనకు సరిగ్గా సరిపోలుతుంది. లాటరీ టికెట్ ద్వారా అనేక మంది తలరాత రాత్రికి రాత్రే మారిపోతుంది. దీంతో తన తలరాత కూడా మారుతుందని ఆశతో లాటరీ టికెట్ కోన్న ఆ వ్యక్తి కూడా తనను అదృష్టం వరిస్తుందనే ఆశలు నింపుకున్నాడు. ఇలా ఎన్నాళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడో తెలియదు కానీ ఈ సారి మాత్రం ఆయన అనుకన్నదే జరిగింది. ఆయనకు లాటరీలో ప్రైజ్ వచ్చింది.

కానీ ఈ విషయం ఆయనకు తెలుసో లేదో కానీ ఈ లోపే ఆయన నీట మునిగి అనంతవాయువుల్లో కలసిపోయాడు. ఆయన అదృష్టం వరించిందను కోవాలా.? లేక అంతకు ముందగానే దరదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందనుకోవాలా.? మొత్తానికి ఆయన అదృష్టాన్ని అందుకోలేని దురదృష్టవంతుడు అనుకోవాల్సిందే? కెనడాలో జరిగిన ఈ ఘటన స్థానికులను సైతం విషాదంలోకి నెట్టింది. కెనడాలోని ఆంటారియో ప్రావిన్సులోని సముద్రం తీరంలోకి ఆయన మృతదేహం కోట్టుకువచ్చింది. ఆయనతో పాటు ఆయనను విజేతగా నిలిపిన లాటరీ టికెట్ కూడా కోట్టుకువచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. గత శుక్రవారం కెనడాలోని ఓ బీచ్‌లో ఓ మృతదేహం కనిపించింది. దాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని..మృతదేహాన్ని పరిశీలించారు. అతని వేసుకున్న దుస్తుల్లో వారికి ఓ లాటరీ టిక్కెట్టు కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని గురించి వివరాలు తెలుసుకోవటానికి దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా అతను 57 ఏళ్ల గ్రెగొరీ జార్విస్ అనే వ్యక్తిగా గుర్తించారు.

అలాగే అతని వద్ద లభ్యమైన లాటరీ టిక్కెట్లుకు రూ.33 లక్షల 42వేలు లాటరీ గెలుపొందినట్లుగా తెలుసుకున్నారు. సముద్రంలో బోట్‌ ప్రయాణం చేస్తున్న అతడు బోట్ అదుపు తప్పి.. అతను మృతిచెందాడని..ఆ తరువాత అతని మృతదేహం బీచ్‌కు కొట్టుకొచ్చినట్లుగా గుర్తించారు. కాగా గ్రెగొరీ అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనీ..అతని మృతదేహం వద్ద లభించిన లాటరీ టికెట్‌ సెప్టెంబర్‌ నెల మొదట్లో కొన్నాడని..తెలిపారు పోలీసులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతని బంధువుల సమాచారం లభిస్తే ఆ లాటరీ టికెట్ ఇస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh