Farmers protest: SC asks how can highways be blocked రైతులు నిరసన దీక్షలపై కేంద్రానికి ‘సుప్రీం’ అక్షింతలు

Farmers protest how can highways be blocked perpetually asks supreme court

farmers protests, farmers protests Delhi, Delhi farmers protests, farmers protests road blockage, farmers protests highways blocked, highways blocked due to farmers protests, road blockage due to farmers protests, supreme court on farmers protests, supreme court on road blockage due to farmers protests, supreme court on highways blocked due to farmers protests

The Supreme Court took a view of the continued blockade of highways in Delhi-NCR due to farmers protests against the three agriculture laws and said that this can not be a perpetual problem. A Bench headed by Justice said that the redressal of the issue can be through the judicial forum, agitation or parliamentary debates and asked how can highways be blocked.

రైతులు నిరసన దీక్షలపై కేంద్రానికి ‘సుప్రీం’ అక్షింతలు

Posted: 09/30/2021 07:16 PM IST
Farmers protest how can highways be blocked perpetually asks supreme court

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, సహా దేశవ్యాప్తం రైతులు దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీలలో గత ఏడాది డిసెంబర్ 26 నుంచి చేపట్టిన నిరసనలు పది నెలలకు చేరుకుంది. ఈ క్రమంలో ఈనెల 27న రైతు సంఘాలతో పాటు విపక్షాలు, పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, బ్యాంకు అసోసియేషన్లతో కలసి పిలుపునిచ్చిన భారత్ బంద్ ను జయప్రదం చేశారు. ఈ క్రమంలో రైతు సంఘాల నిరసన ప్రదర్శనలతో తమ రాకపోకలకు విఘాతం కలుగుతోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి.

ఢిల్లీకి చేరుకునే రహదారులపై ప్రయాణంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా రైతుల అందోళనలపై ఎందుకు స్పందించడం లేదని కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు అంక్షితలు వేసింది. ఈ క్రమంలోనే అటు రైతు సంఘాల నేతల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధనంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా.? ఎందుకని కావాలని జాతీయ రహదారులపై వాహనాలను అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. రహదారులపై నిరసనలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. జాతీయ రహదారులను దిగ్బంధించడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది.

కాగా పిటీషన్ల విచారణ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతు సంఘాలు నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జ్యుడీషియల్ ఫోరం, పార్లమెంటరీ చర్చలతోనే రైతు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. అంతేకాని రహదారుల దిగ్భంధనంతో కాదని పేర్కొంది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ నియమించామని, చర్చలకు నిరసనకారులు నిరాకరించారని తెలిపారు.

దీనిపై కోర్టు స్పందిస్తూ కోర్టులు సూచించిన వాటిని మీరు అమలు చేయాల్సి పేర్కొంది. అయితే ఈ కేసులో ఎవరైనా పార్టీ కావాలని మీరు కోరుకుంటే.. పిటిషన్‌ దాఖలు చేయాలని చెప్పింది. ఈ మేరకు రైతులను ప్రతివాదులుగా చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేయగా.. ఇందుకు సంబంధించి పిటిషన్‌ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్‌ 4వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు హర్యానా ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్‌ చేసేందుకు నిరసన తెలుపుతున్న రైతులను ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles