Bhabanipur bypoll: 36% polling till 1pm మమత కోటలో మందకొడిగా పోలింగ్.. 36శాతం నమోదు

Bypolls underway in west bengal 36 polling in bhabanipur till 1pm

Mamata Banerjee, Bhabanipur by-poll, Jangipur, Samserganj, Mamata Banerjee, Nandigram, Suvendhu Adikari, by-poll, priyanka tibrewal, Odisha by poll, Pipili by poll, BJD, Naveen Patnaik, West Bengal, odisha, Politics

Bypolls are being conducted on Thursday in three assembly constituencies in West Bengal – Bhabanipur, Samserganj, and Jangipur; as well as one other constituency in Odisha – Pipili. Voting was largely peaceful amidst high deployment of security personnel. Till 1 p.m., about 35.97 % voters had exercised their franchise, compared to 53.78 % in Jangipur and 57.15 % at Samserganj, both in the State.

భవానీపూర్ ఉప-ఎన్నికలు: మమత కోటలో మందకొడిగా పోలింగ్..

Posted: 09/30/2021 01:18 PM IST
Bypolls underway in west bengal 36 polling in bhabanipur till 1pm

ప‌శ్చిమ బెంగాల్ లోని మూడు, ఒడిశాలోని ఒక అసెంబ్లీ స్థానానికి ఇవాళ ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ఓటర్లు తమ అమూల్యమైన హక్కును వినియోగించుకుంటున్నారు. ఒడిశాలోని పిపిల్లి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పశ్చమ బెంగాల్ లోని భవానీపూర్, సంషేర్ గంజ్, జాంగీపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యావత్ రాష్ట్రంతో పాటు దేశం దృష్టిని ఆకర్షించినది మాత్రం భవానీపూర్ నియోజకవర్గమే. ఎందుకంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ బరిలో నిలిచారు.

కాగా భ‌వానీపుర్ నియోజ‌క‌వ‌ర్గం ఉపఎన్నిక‌లకు ఉదయం 7 గంటలకు తెరలేచినా.. ఓటర్లు మాత్రం పెద్దగా ఉపఎన్నికలపై శ్రద్దచూపడం లేదని తెలుస్తోంది. ఉదయం నుంచి ఎన్నికలు మందకొడిగానే సాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి కూడా ఇక్కడ పోలింగ్ 36శాతాన్ని మించలేదు. దీంతో ఓటర్ల నిరాసక్తత కొట్టోచ్చినట్టు కనబడుతోంది. ఐదు మాసాల్లో రెండు సార్లు ఎన్నికలు రావడంతో ఓటర్లు పెద్దగా పోలింగ్ పై దృష్టి సారించినట్లు లేదు. ఇకఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కూడా పోలింగ్ తక్కువగా నమోదయ్యేందుకు కారణంగా మారిందా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కాబా బవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011, 2016లో పోటీ చేసిన మమతా బెనర్జీ.. ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో అమె నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. బీజేపి నేత సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. దీంతో భవానిపూర్ ఎమ్మెల్యే  టిఎంసి నేత సోవాందేబ్ చటోపాధ్యాయ్ రాజీనామా చేశారు. కాగా ఈ ఉప ఎన్నికలలో మమతా బెనర్జీతో బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా తిబ్రేవాల్ పోటీప‌డుతున్నారు. కొల్ కత్తా హైకోర్టులో 41 ఏళ్ల తిబ్రేవాల్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. భావానిపూర్ నియోజకవర్గం నుంచి గెలిస్తేనే మమత ముఖ్యమంత్రిగా వ్యవహరించ గలుగుతారు. కాగా, అక్టోబ‌ర్ 3న ఫ‌లితాలు వెలుబ‌డుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles