Will perforn Shramadanam on Cotton Barrage: Janasena శ్రమదానానికి ‘నో’ పర్మీషన్.. జరిపి తీరుతామంటున్న జనసేన

Janasena shramadanam permission denied at cotton barrage says ap irrigation se

Pawan Kalyan, Sramadanam, Janasena, Gandhi Jayanthi, October 2nd, Road repair work, puttaparthy, Anantapur, Dowleshwaram barrage, cotton barrage, Irrigation SE, Andhra Pradesh, Politics

Amid denial of permission for JanaSena activists Shramadanam at Dhavaleswaram Barrage by the State Government and Irrigation department SE, pawan kalyan fans and party activists say they will perform shramadhanam at barrage on october 2nd.

పవన్ శ్రమదానానికి ‘నో’ పర్మీషన్.. జరిపి తీరుతామంటున్న జనసేన

Posted: 09/30/2021 03:02 PM IST
Janasena shramadanam permission denied at cotton barrage says ap irrigation se

బ్రిటీష్ పాలకులహయాంలో సర్ అధుర్ థామస్ కాటన్‌ అనే ఇరిగేషన్ ఇంజనీరు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నిర్వహించ తలపెట్టిన శ్రమదానానికి అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబ‌రు2న‌ జనసేన పార్టీ శ్రమదానం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే, అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ‌ల వ‌న‌రుల శాఖ‌ అనుమతి నిరాకరించింది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ శ్రమదాన కార్యక్రమం చేప‌ట్టాల‌నుకున్న‌ కాటన్‌ బ్యారేజీ రాష్ట్ర రోడ్లు భవనాల పరిధిలోకి రాదని జలవనరుల శాఖ ఎస్ఈ స్పష్టం చేసింది.

ఇది జలవనరుల శాఖకు చెందిన బ్యారేజీ అని.. అయితే ఈ బ్యారేజీపై ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ప్రకటన చేసింది. కాటన్‌ బ్యారేజీపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం జ‌రుగుతుంద‌ని జ‌లవ‌న‌రుల శాఖ తెలిపింది. కాగా, దీనిపై కూడా జనసేన కార్యకర్తులు ధీటుగానే కౌంటర్ ఇస్తున్నారు. ప్రజలను అనుమతిస్తూన్న తనుణంలో రో్డు గోతులమయంగా మారితే ఎందుకు పూడ్చకుండా కాలక్షేపం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆర్ అండ్ బి పరిధిలోకి రాని బ్రిడ్జిపై గోతులను పూడ్చేందుకు మాత్రం ఆర్ అండ్ బి నిధులు కావాలా.? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక జనసేన అది నాయకత్వం మాత్రం కావాల‌నే ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతామని స్ప‌ష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో మ‌రోసారి భేటీ కానున్నారు. అక్టోబ‌రు 2న చేప‌ట్టాల్సిన రోడ్ల శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంపై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. అన్ని నియోజ‌క వ‌ర్గాల్లోనూ శ్ర‌మ‌దానంలో జన‌సైనికులు, ప్ర‌జ‌లు పాల్గొనేలా కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మీడియాతో మాట్లాడ‌బోర‌ని ప్ర‌త్యేకంగా చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles