Bypoll That Mamata Banerjee Will Contest Won't Be Cancelled: HC భవానీపూర్ ఉప-ఎన్నికలు యధాతథం.. పిల్ కోట్టివేసిన హైకోర్టు

Bhabanipur bypoll to be held as per schedule on sept 30 says calcutta high court

Mamata Banerjee, Bhabanipur by-poll, Calcutta High Court, High court, Mamata Banerjee, Nandigram, Suvendhu Adikari, by-poll, priyanka tibrewal, West Bengal, Politics

The Bhabanipur bypoll, where West Bengal Chief Minister Mamata Banerjee is a contestant, won't be cancelled, the Calcutta High Court ruled today, dismissing a plea against the bypoll. The court added that the bypoll will be held as planned on Thursday.

భవానీపూర్ ఉప-ఎన్నికలు యధాతథం.. పిల్ కోట్టివేసిన హైకోర్టు

Posted: 09/28/2021 12:20 PM IST
Bhabanipur bypoll to be held as per schedule on sept 30 says calcutta high court

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ బరిలో నిలిచిన భ‌వానీపుర్ నియోజ‌క‌వ‌ర్గం ఉపఎన్నిక‌లు యథాతధంగా నిర్వహించాలని కలకత్తా హైకోర్టు అదేశాలు జారీచేసింది. దీంతో సీఎం మమతా బెనర్జీకి ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉప ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోల్‌క‌తా హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ విచారించిన న్యాయస్థానం.. ఉప ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేస్తూ.. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోట్టివేసింది.

ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కోర్టు చెప్పింది. అయితే భ‌బానిపుర్ ఉపఎన్నికలను ప్రకటిస్తూ రాజ్యాంగ అత్యవశ్యకత నేపథ్యంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ పేర్కోనడాన్ని పిటీషనర్ తప్పుబడ్డారు. అయితే ఈ పదంతో ఓటర్లు కూడా ప్రభావితం చెందుతున్నారని ఆయన తన పిటీషన్ లో పేర్కోన్నారు. అయితే పిటీషనర్ ఎన్నికల కమీషన్ పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇక ఈ పదంతో ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం కూడా లేదని న్యాయస్థానం పేర్కోంటూ పిటీషన్ ను తోసిపుచ్చింది.

కాబా బవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011, 2016లో పోటీ చేసిన మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వ‌హించారు. అయితే ఈసారి మాత్రం అమె నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. బీజేపి నేత సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. దీంతో భవానిపూర్ ఎమ్మెల్యే  టిఎంసి నేత సోవాందేబ్ చటోపాధ్యాయ్ రాజీనామా చేశారు. కాగా ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో బావానిపూర్ లో బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా తిబ్రేవాల్ తో మ‌మ‌తా బెనర్జీ పోటీప‌డుతున్నారు. 41 ఏళ్ల తిబ్రేవాల్ కోల్‌క‌తా హైకోర్టులో లాయ‌ర్‌గా చేస్తున్నారు. మూడ‌వ‌సారి సీఎం అయిన మ‌మ‌తా బెన‌ర్జీ.. నందీగ్రామ్‌లో ఓడిపోవ‌డం వ‌ల్ల‌.. భ‌బానీపుర్ ఉప ఎన్నిక‌లో క‌చ్చితంగా ఎమ్మెల్యేగా గెల‌వాల్సి ఉంటుంది. అక్టోబ‌ర్ 3న ఫ‌లితాలు వెలుబ‌డుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles