EC announces by- polls for Huzurabad and Badvel on October 30 హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు మ్రోగిన నగరా

Cec releases schedule for bypolls to 3 loksabha 30 assembly seats on october 30

Central Election Commission,by-election, Badvel by-election, Huzurabad by election, By-Elections, Huzurabad, Badvel, By-polls, 3 Parliamentary constituencies, 30 Assembly seats, Andhra Pradesh, Telangana, Politics

The Central Election Commission (CEC) released the schedule for by-elections for Badvel in Andhra Pradesh and Huzurabad in Telangana. The Central Election Commission (CEC) has announced that by-elections for the two constituencies will be held on October 30.

హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు మ్రోగిన నగరా

Posted: 09/28/2021 11:38 AM IST
Cec releases schedule for bypolls to 3 loksabha 30 assembly seats on october 30

తెలంగాణలోని హాట్ సీటుగా ప్రాధాన్యత సంతరించుకున్న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప-ఎన్నికల నగరా మ్రోగింది. తెలంగాణ ప్రభుత్వంలో అరోగ్య మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాంటూ కొందరు రైతులు అరోపించారని, ఆయనను మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజుకున్న రాజకీయ సెగ ఈటెల పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ ఏడాది జూన్12న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి రాష్ట్రంలో హాటు రాజకీయాలకు హుజూరాబాద్ వేదికగా మారింది.

ఒకవైపు ఈటెల, మరోవైపు టీఆర్ఎస్ మంత్రివర్గం, ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా హరీశ్ రావు తిష్టవేసిన మరీ ఎన్నికల ప్రచారం కొనసాగించారు. కాగా, అక్టోబర్ 30న ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడదుల చేసింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానం నుంచి గెలుపోందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మార్చి 28న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అప్పటి నుంచి ఈ స్థానంలో ఎమ్మెల్యే లేరు.

దీంతో ఈ స్థానానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప-ఎన్నికలను నిర్వహించనుంది. వీటితో పాటు పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల లెక్కింపు నవంబరు 2న జరగనుంది.

కరోనా మహమ్మారి సహా పండుగలు, వరదలు, చలి వంటి అన్ని అంశాలనూ ఎలక్షన్ కమిషన్ పరిశీలించిందని ప్రకటనలో తెలిపింది. ఈ విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ స్పష్టంచేసింది. వీటితోపాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles