Anantapur district in AP has gold mines అనంతపురం జిల్లాలో బంగారు ఖనిజ నిల్వలు..

Anantapur district in ap has 16 tonnes of gold mines

Composite License, Mineral Development corporation, E-Auction, boksampalli, Roddam, Joukula, Ramgiri, Gold Mines, Anantapur District, Andhra Pradesh, Politics

According to AP state government data on minerals, there are a number of gold-bearing greenstone schist belts at Ram Giri in Anantapur and other adjoining areas in Rayalaseema region. Gold percentage will be seen more if mining takes out in Ramagiri mines.

అనంతపురం జిల్లాలో బంగారు ఖనిజ నిల్వలు.. 16 టన్నుల అంచనా

Posted: 09/27/2021 07:19 PM IST
Anantapur district in ap has 16 tonnes of gold mines

రాయలసీమ కోటి రతనాల సీమ అని ఎందరెందరో కవులు ఇప్పటికే కొనియాడిన విషయం తెలిసిందే. అది చాలదన్నట్లు ఈ సీమలో వర్షం తొలి చినుకులు పడితే చాలు వజ్రాలు, వైడూర్యాలు కూడా ప్రజలకు లభిస్తుంటాయి. దీంతో రాయలసీమ నిజంగానే రతనాలసీమ అని కొనియాడేవారు అధికమయ్యారు. మరీ ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఇలా వజ్రాలు లభ్యమయ్యే ఘటనలు అధికం. ఇక ఇప్పుడు అనంతపురంలో రతనాలే కాదు.. భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 16 టన్నుల వరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన ఖనిజాన్వేషణ విభాగం కాంపోజిట్ లైసెన్స్ జారీకి రెడీ అవుతోంది.

జిల్లాలోని రామగిరిలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) గనులు ఉండగా, 2001 నుంచి అక్కడ తవ్వకాలు నిలిపివేశారు. ఇప్పుడు ఈ మైన్స్‌కు సమీపంలో రెండు చోట్ల, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండు చోట్ల, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో ఆరు చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఈ పది ప్రాంతాల్లో 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొన్నారు. పైన పేర్కొన్న ప్రాంతాల్లో 50 మీటర్ల నుంచి దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు.

టన్నుమట్టిలో నాలుగు గ్రాములు ఉంటుందని, జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణ కోసం కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వనున్నారు. దీని ప్రకారం.. ఒక్కో వ్యక్తి లేదంటే సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు అన్వేషించుకునేందుకు లైసెన్స్  ఇస్తారు. పూర్తిస్థాయిలో నిక్షేపాలు గుర్తిస్తే మైనింగ్ లీజు కేటాయిస్తారు. త్వరలోనే ఇందుకు ఈ-వేలం నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles