IMD issues red alert for 14 districts of Telangana తెలంగాణలోని కుమ్మేసిన వర్షం.. రేపు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్..

Imd issues red alert for 14 districts of telangana

Heavy Rains, Weather update, Red Alert, Rains in Telangana, Rains in Hyderabad, Meteorological department, Telangana, Torrential rains, Telangana

Rains lashed several parts of Telangana on Monday. India Meteorological Department (IMD) has predicted heavy to extremely heavy rains at isolated places in different districts of the state over the next 24 hours. Meanwhile, a red alert has been issued for 14 districts of the state including Nirmal, Nizamabad, Jagityal, Rajanna Sircilla, Karimnagar, Peddapally, Bhadradri Kothagudem, Khammam, Mahabubabad, Warangal (Rural), Warangal (Urban), Janagaon, Siddipet, Kamareddy.

తెలంగాణలోని కుమ్మేసిన వర్షం.. రేపు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్..

Posted: 09/27/2021 06:26 PM IST
Imd issues red alert for 14 districts of telangana

గులాబ్‌ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే వుంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు సోమవారం తెల్లవారు జామునుంచి ఏడతెరపి లేకుండా కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయ్యం అయ్యాయి, లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి, తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసాయి. తుపాను ప్రభావంతో హైద‌రాబాద్‌, ఉమ్మడి మెదక్ జిల్లా, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత వాతావరణ కేంద్రం మరో పిడుగు లాంటి వార్తను వెలువరించింది. వాతావరణ శాఖ తెలంగాణలో తాజా హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని ఏకంగా 14 జిల్లాల్లో వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాతావ‌ర‌ణ శాఖ 14 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. నిర్మ‌ల్, నిజామాబాద్, కామారెడ్డి, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, సిద్దిపేట‌, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్, జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌, మ‌హ‌బూబాబాద్, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల‌కు రెడ్ అలర్ట్ హెచ్చ‌రిక‌ల‌ను వాతావ‌ర‌ణ శాఖ జారీ చేసింది. రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. అత్య‌వ‌స‌రం అయితేనే బ‌య‌ట‌కు రావాల‌ని పోలీసు శాఖ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. భారీ వ‌ర్షాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. ప్ర‌తీ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్ లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles