MP man thrashed brutally for harassing a Girl చెల్లికి వేదింపులు.. ఆకతాయిని చావచితకొట్టిన సోదరులు

Tied by neck with belt mp man thrashed by relatives of girl he harassed

man brutally thrashed in Madhya Pradesh, Girls relatives thrashed Man, man thrashed brutally, man thrashed in MP social media, Baldau Jadhav, extortion case, harassement, girl, girl Relatives, harassed girl, viral video, Rewa, Madhya Pradesh, Crime

A viral video of a man being verbally abused and brutally beaten up has prompted the police in Rewa district of Madhya Pradesh to register a case against three people. Police have said 28-year-old Baldau Jadhav was assaulted by relatives of a girl after he allegedly harassed her.

ITEMVIDEOS: చెల్లికి వేదింపులు.. ఆకతాయిని చావచితకొట్టిన సోదరులు..

Posted: 09/21/2021 01:31 PM IST
Tied by neck with belt mp man thrashed by relatives of girl he harassed

యువతలో ప్రతీకార భావన వేళ్లూనుకుంటోంది. నేరానికి నేరంతోనే సమాధానం చెబుతామన్న వైఖరి నేటి యువతలో అధికమవుతోంది. రాయితో కొడితే.. ఇటుకతో బదులిస్తా అన్న ధోరణి పెరిగిపోతోంది. ఓ బాలిక‌ను వేధింపుల‌కు గురి చేసిన ఓ ఆకతాయికి బుద్ది చెప్పే క్రమంలో బాలిక సోదరులు కూడా నేరానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. తమ సోదరిని వేధింపులకు గురిచేసిన అకాతాయిని మెడకు బెల్టు కట్టి.. కర్రలతో చావచితకోట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. అకతాయి తప్పు చేశానని అంగీకరించి.. ఇకపై చేయను తనను వదిలేయాలని ప్రాథేయపడుతున్నా.. అసలు పట్టించుకోవద్దని వారు దారుణంగా కోట్టారు.

అకాతాయి నోట్లో నుంచి రక్తం కారుతున్నా.. మెడపై, తలపై రక్తపు గాయాలైన బాలిక సోదరులు అతడ్ని విడిచిపెట్టలేదు. ఇద్దరు యువకులు ఒకరి తరువాత ఒకరు విడతల వారీగా చావచితకబాదారు.  ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవా జిల్లాలో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 28 ఏండ్ల వ‌య‌సున్న బ‌ల్దౌ జాద‌వ్.. దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభ‌వించి ఇటీవ‌లే జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. తాను నివాస‌ముంటున్న ఏరియాలో ఓ బాలిక‌పై క‌న్నేసి.. ఆమెను వేధింపుల‌కు గురి చేశాడు. తొలుత బాలిక తనను కాదని భావించి వెళ్లిపోయినా తరువాత అమెను పేరుతో వేధించసాగాడు.

దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఈ విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్పింది. దీంతో జాద‌వ్ పై బుద్దిచెప్పాలని నిర్ణయించుకున్న బాలిక కుటుంబ స‌భ్యులు.. అతడ్ని ఒంటరిగా ప‌ట్టుకుని నిర్జన ప్రాంతానికి అపహరించుకుని పోయారు. నిర్ఝన ప్రాంతంలో అతడి మెడ‌కు బెల్ట్‌ను చుట్టి హింసించారు. నోట్లో నుంచి ర‌క్తం కారేలా కొట్టారు. తాను త‌ప్పు చేశాన‌ని, మ‌రోసారి ఇలాంటి పాడు ప‌నులు చేయ‌న‌ని ప్రాధేయ‌ప‌డిన‌ప్ప‌టికీ అత‌న్ని వ‌దిలిపెట్ట‌లేదు. ఈ ఘ‌ట‌న‌ను కొంద‌రు త‌మ సెల్‌ఫోన్ల‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. యువ‌కుడిని చిత‌క‌బాదిన వారిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baldau Jadhav  extortion case  harassement  girl  girl Relatives  harassed girl  viral video  Rewa  Madhya Pradesh  Crime  

Other Articles