Clash between YSRCP, TDP activists in Guntur గుంటూరులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

Bheemla nayak s dialogue leads to clash between ysrcp tdp activists in guntur district

Ganesh Immersion, YSRCP, TDP, ZPTC Sharada, Pawan Kalyan, Bheelma Nayak, Kopparru village, Pedanandipadu mandal, Guntur, Andhra Pradesh, Crime

A dialogue from Pawan Kalyan starrer Bheelma Nayak led to clash between the YSRCP and TDP activists at Kopparru village in Pedanandipadu mandal in Guntur district on Monday night. Two persons injured in the incident and they were admitted to nearby government hospital.

ITEMVIDEOS: ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణమైన భీమ్లానాయక్ డైలాగ్

Posted: 09/21/2021 11:01 AM IST
Bheemla nayak s dialogue leads to clash between ysrcp tdp activists in guntur district

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో విడుదలకు సిద్దమవుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాన్ భీమ్లా నాయక్ చిత్రంలోని డైలాగ్ ఘర్షణకు దారితీసింది. పెదనందిపాడు మండల పరిధిలోని కొప్పర్రులో టీడీపీ నేత, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బత్తిని శారద ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి కర్రలు, రాళ్లతో దాడిచేశారు. ఇంట్లోకి ప్రవేశించి సామగ్రిని ధ్వంసం చేసి, ఇంట్లోని వస్తువులతోపాటు ఆరు బైకులపై పెట్రోలు పోసి నిప్పంటించినట్టు చెబుతున్నారు. వైసీపీ నేతల దౌర్జన్యంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అక్కడి నుంచి అందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా గతంలో హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు జరిగే విషయం తెలిసిందే. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం కొత్తగా రాజకీయ అల్లర్లు జరగడం కలకలం రేపుతోంది. అన్నివర్గాల ప్రజలు ఎంతో భక్తిపారవశ్యంతో జరుపుకుని అంతే భక్తిశ్రద్దలతో గణనాధుని గంగమ్మ ఒడికి చేర్చే నిమజ్జన ఉత్సవంలో పాల్గోంటారు. అయితే గుంటూరులోనూ అదే జరిగింది. గత రాత్రి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన గణనాధుడిని హంగామాఆర్భాటాల మధ్య నిమజ్జనానికి తరలిస్తున్నారు. అయితే వారు వెళ్లే దారిలో వున్న టీడీపీ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడి ఇళ్లు వుంది. అక్కడే అర్ధరాత్రి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన గణనాధుడి జడ్సీటీసీ సభ్యురాలు బత్తిన శారద ఇంటివద్దకు చేరుకోగానే వైసీపీ నేతలు చాలా సేపు అక్కడే డాన్సు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందినవారు పవన్ కల్యాన్ భీమ్లానాయక్ చిత్రంలోని డైలాగ్ చెప్పడంలో వైసీపీ కార్యకర్తలు వారిపై ఘర్షణకు దిగారు. అంతటితో ఆగనివారు ఆ తర్వాత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు శారద ఇంటిపైకి దాడి దిగినట్టు సమాచారం. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ ఇంటిపై దాడికి దిగారని శారద ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles