Sudden Snake Attack Sends Man Running ఆకస్మికంగా దాడి చేసిన పాము.. పరుగులు తీసిన వ్యక్తి

Venemous snake sudden attack sends man running in thailand

Snake Attack, Snake Attack man, Snake bite man, Thailand, Bankok video, Bankok snake video, Thailand snake video, bankok snake sudden attack, Thailand snake suden attack, viral videos, trending videos

This man was going about his day, minding his own business when a snake sent him scrambling. Footage filmed in Thailand shows the man running for his life after being surprised by the snake.

ITEMVIDEOS: ఆకస్మికంగా దాడి చేసిన పాము.. పరుగులు తీసిన వ్యక్తి

Posted: 09/17/2021 08:13 PM IST
Venemous snake sudden attack sends man running in thailand

మీ పనిలో మీరు నిమగ్నమై వుండగా, రెప్పపాటు సమయంలో ఒక పాము మీపైకి దూసుకువస్తే.. ఈ వీడియోలో అదే జరిగింది. ఎక్కడి నుంచి శరవేగంగా దేసుకువస్తున్న పాము ఉన్నట్టుండి ఒక వ్యక్తి వెంట పడింది. దీంతో అతడు భయంతో పరుగులు తీశాడు. థాయిలాండ్‌లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఒక ఇంటి లాబీలోని డిన్నర్‌ టేబుల్‌ వద్ద ఒక వ్యక్తి సర్దుతున్నాడు. ఇంతలో ఒక వైపు నుంచి వచ్చిన పాము అతడిపై దాడి చేయబోయింది. క్షణంలో గమనించిన అతడు భయంతో వేగంగా పరుగు తీశాడు.

ఆ పాము కూడా అంతే వేగంగా అతడి వెంట పడింది. అయితే ఇద్దరు అదే దిశగా వెళ్లడంతో అతని వెంట పడినట్లు అనిపించింది. అయితే అంతకుముందు అది సోఫా కిందకు చేరుకుని పడగ విప్పి.. ఆక్కడ నిల్చున్న వ్యక్తిని కాటు వేసేందుకు ప్రయత్నించింది. అయితే సకాలంలో దానిని గుర్తించిన వ్యక్తి ఒక్కసారిగా తన కాలును తీయడంతో కాలు నుంచి తప్పించుకున్నాడు. దీంతో పాము మనిషి నుంచి తప్పించుకునేందుకు పోదల్లోకి వెళ్లింది.

అయితే పాము తన వెంట పడుతుందని భావించిన వ్యక్తి కూడా దాని నుంచి తప్పించుకునేందుకు పక్కకు పరిగెత్తాడు. కాగా, ఆ ఇంటి ఆవరణలోని సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిని చూసి నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేశారు. పాములు ఇంత దూకుడుగా దాడి చేస్తాయా అని కొందరు, ఇది ఊహించని దాడి అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాము ఒక వ్యక్తిని హత్య చేయబోయిందని ఒకరు చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Snake Attack  Snake Attack man  Snake bite man  viral videos  trending videos  

Other Articles

Today on Telugu Wishesh