Zomato, Swiggy to collect GST for deliveries స్విగ్గీ, జోమాటో ఆర్డర్లపై ఇక జీఎస్టీ.. జనవరి 1 నుంచి అమలు

Swiggy zomato to collect 5 gst from customers starting 1 jan 2022

GST, Goods and Services Tax, GST Council, GST, Zomato, Swiggy, Zomato Swiggy GST, GST for food delivery apps, Zomato GST, Swiggy GST Nirmala Sitharaman, GST Council, Zomato and Swiggy GST, GST Council announcements, GST petrol, Revenue Secretary Tarun Bajaj

Food delivery apps like Swiggy and Zomato will collect five percent Goods and Services Tax (GST) from consumers instead of the restaurant they pick up orders from, starting 1 January 2022. However, customers will not have to pay extra for getting their food delivered.

స్విగ్గీ, జోమాటో ఆర్డర్లపై ఇక జీఎస్టీ.. జనవరి 1 నుంచి అమలు

Posted: 09/18/2021 11:30 AM IST
Swiggy zomato to collect 5 gst from customers starting 1 jan 2022

దేశంలో పుడ్ డెలివరీ యాప్ లు వచ్చిన తరువాత నగరవాసుల్లో కాసింత బద్దకం ఎక్కువైంది. ఇన్నాళ్లు ఏదో ఒక హోటల్ కనిపిస్తే చాలు బోజనం చేద్దామనుకునే నగరవాసి.. ఇప్పుడు ఇంట్లోంచి అడుగు బయటపెట్టడానికి కూడా బద్దకిస్తూ.. ఆ బోజనమేదో అర్ఢర్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాడు. అయితే నగరవాసి బద్దకానికి ఇకపై చార్జీ పడనుంది. అదేంటి అంటారా.. ఇకపై ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా తెప్పించుకునే ప్రతీ ఆహారంపై కేంద్రం జీఎస్టీని వడ్డించనుంది. ఇన్నాళ్లు ఎలాంటీ జీఎస్టీలు లేకుండా కోందరు.. ఇక అవకతవకలకు పాల్పడే మరికొందరు జీఎస్టీలను చెల్లించకుండా ఎగ్గోడుతున్నారని.. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ యాప్ లకు ఈ బాధ్యతను అప్పగించనుంది జీఎస్టీ మండలి.

దీంతో ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ సహా ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలే ఆర్డర్లపై జీఎస్టీ వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే దీని వల్ల వినియోగదారులపై ఎటువంటి భారమూ పడబోదని వివరణ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో జీఎస్టీ మండలి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. కొత్త పన్నులేవీ లేవని వెల్లడించిన ఆమె.. ఫుడ్ ఆర్డరింగ్ సంస్థలే యూజర్ల నుంచి జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పారు.

ఇప్పటి వరకూ ఈ యాప్స్ అన్నీ కూడా టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) కింద నమోదై ఉన్నాయి. ఈ విషయంపై ఆర్థిక శాఖ సెక్రటరీ తరుణ్ బజాజ్ వివరణ ఇచ్చారు. ‘‘మనం ఒక యాప్ నుంచి ఆహారం ఆర్డర్ ఇస్తే..  దీనిపై జీఎస్టీని ఇప్పటి వరకూ రెస్టారెంట్లే చెల్లించాయి. అయితే కొన్ని రెస్టారెంట్లు ఈ పన్ను చెల్లించడం లేదు. అందుకే ఇక నుంచి సదరు యాప్స్ ఈ జీఎస్టీ వసూలు చేసి చెల్లించాలని నిర్ణయించాం’’ అని ఆయన తెలిపారు.

హర్యానాలోని కొన్ని రెస్టారెంట్లు చూపించిన లెక్కలకు, ఆ రెస్టారెంట్ల నుంచి ఈ యాప్స్ తీసుకున్న ఆర్డర్లకు లెక్కల్లో తేడా వచ్చినట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఇలా ఆదాయం తక్కువగా చూపించిన కొన్ని రెస్టారెంట్లు పన్ను ఎగవేసినట్లు తరుణ్ చెప్పారు. ఈ క్రమంలోనే ఇకపై జీఎస్టీ వసూలు చేసి చెల్లించే బాధ్యతను ఈ ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్‌కే అప్పగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆతిధ్య రంగం నుంచి ఆశించిన మేరకు జీఎస్టీ వసూళ్లు వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GST Council  GST  Zomato  Swiggy  Zomato Swiggy GST  GST for food delivery apps  Zomato GST  Swiggy GST  

Other Articles