ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్ కు చెందని ఆరు కార్యాలయాలపై దాడుల తరువాత రెండో రోజు ఆయన నివాసంపై కూడా అదాయపన్నుశాఖఅధికారులు దాడులు చేయడంపై దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపి ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు సంధించాయి. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం మనసత్తత్వం తాలిబన్ మాదిరిగానే వుందని.. అందుకు ఈ ఘటనే నిదర్శనమని అమ్ అద్మీ పార్టీ (ఆప్), శివసేన పార్టీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇది కచ్చితంగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతున్న దాడులని అరోపించాయి.
ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర విధించిన లాక్ డౌన్ తో వందలాది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తున్న వలసకూలీలల్లో బతుకుపై భరోసాను నిలిపి.. అన్నం పెట్టి ఆదరించిన.. అక్కున చేర్చుకుని వారిని స్వస్థలాలకు పంపేందుకు సోంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేశాడు. కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయని విధంగా ఆయన వలస కూలీలకు ఆపన్నహస్తం అందించి మెసయ్య అప్ మైగ్రెంట్స్ గా మారారు. దీంతో ఆయన పేరు యావత్ దేశవ్యాప్తంగా మార్మోగ్రింది. ఆయన చేసిన ధాతృత్వ కార్యక్రమాలు ఏడాదిన్నర కాలంగా ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి.
ఈ క్రమంలో ఆయన కార్యాలయాలు, ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడం చర్చనీయంశంగా మారింది. ఢిల్లీలోని ఆప్ సర్కార్ కు బ్రాండ్ అంబసిడార్ గా నియమితులైనందుకు రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ దాడులు చేస్తున్నదని ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. గొప్ప పరోపకారిని చూసి ప్రభుత్వం అభద్రతాభావానికి గురవుతున్నదని రాఘవ్ చద్దా ఆరోపించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కూడా నేరమేనా? అని ఆప్ ప్రశ్నించింది. కాగా ఈ పరిణామాలపై మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కూడా ఘాటుగానే స్పందించింది.
మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్సీ మనీషా కయాండే స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరి.. తాలిబన్ల మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాదరణ పొందిన నటుడు సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆప్ సర్కార్ రాయబారిగా నియమితులు కావడం దీనికి కారణం కావచ్చు. బీజేపీయేతర పార్టీలకు మద్దతు ఇచ్చిన వారు దర్యాప్తును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కావచ్చు.. ఐటీ దాడులు కావచ్చు… ఇది తాలిబన్ల మనస్తత్వానికి అతి సమీపంలో ఉందని మనీషా కయాండే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more