Delhi airport turns into swimming pool జలదిగ్బంధంలో ఢిల్లీ విమానాశ్రయం.. వరద నీటిలో విమానాలు

Delhi airport turns into swimming pool as city records highest rainfall in 46 years

delhi airport, heavy rains in delhi, airport flooded, waterlogging, Indira Gandhi International Airport, Teriminal 3, Delhi Rains, Delhi

Following heavy rainfall in the national capital on Saturday morning, the Indira Gandhi International Airport in Delhi witnessed flooding at the forecourt and in some other areas. According to the authorities, the water has now been drained out and it is all clear.

ITEMVIDEOS: జలదిగ్బంధంలో ఢిల్లీ విమానాశ్రయం.. వరద నీటిలో విమానాలు

Posted: 09/11/2021 03:49 PM IST
Delhi airport turns into swimming pool as city records highest rainfall in 46 years

భారీవర్షాల ధాటికి దేశరాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షకాలంలో వరుణుడు ఢిల్లీపై కుండపోత వర్షాన్ని కురిపిస్తున్నాడు. దీంతో ఢిల్లీ అంతర్జాతీయ విమనాశ్రయంలోకి వరద నీరు ముంచెత్తి విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగించింది. దేశవిదేశాలకు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులను కూడా వర్షాలు ఇబ్బంది పెట్టాయి. దీంతో విమానాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా టీ-3 టెర్మినల్ ను వరద నీరు ముంచెత్తింది.

విమానాశ్రయంలోని టీ-3 టెర్మినల్ లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు వేచి ఉండే స్థలం బోడింగ్ పాస్ తీసుకునే ప్రాంతం మొత్తం కూడా నీటితో నిండిపోయింది. డిపాచెస్, అలాగే అరైవల్ ప్రాంతాల్లోకి కూడా నీరు చేరిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రన్ వేపై నిలిపి ఉంచిన ఎయిర్ క్రాప్ట్ వద్దకు కూడా వర్షపు నీరు పూర్తిగా చేరడంతో విమాన రాకపోకలకు కొంత ఆలస్యం అవుతుంది. విస్తారా, ఎయిర్ ఇండియా సహా ఇండిగో, స్పైస్ జెట్ వంటి విమానాల ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు.

వర్షం కారణంగా ఆలస్యంగా విమానాలు నడుపుతున్నట్లు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షపాత నమోదు అయింది. 46 ఏళ్లల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే 11.5 శాతం వర్షపాతం నమోదు అయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, ఎయిర్ పోర్టు, నది పరీవాహక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఢిల్లీని రుతుపవనాలు ఆలస్యంగా తాకాయి. ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతవరణ శాఖ ఢిల్లీకి అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో దేశ రాజధానిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles