IMD issues orange alert to Hyderabad for 2 days తెలంగాణకు రెడ్ అలర్ట్: మూడు రోజులు భారీ వర్షాలు..

Imd issues red alert forecasts heavy rains for three days in telangana

hyderabad heavy rains, IMD Red Alert, Indian meteorological department, Southwest monsoon, Telangana Heavy Rains, Hyderabad rains, Telangana Rains, Sangareddy, Rangareddy, Medak, Yadadri, Telangana Red Alert, District collectorate, Emergency services, GHMC numbers

IMD issued a red alert, indicating that the state is in for some extremely heavy rainfall. Meteorological Department said the next two days would witness heavy to very heavy rain in 16 districts and several parts of the state, including Hyderabad. The Greater Hyderabad was issued Orange alert for next wod days.

తెలంగాణకు రెడ్ అలర్ట్: మూడురోజులు భారీ వర్షాలు.. గ్రేటర్ కు ఆరెంజ్..

Posted: 09/06/2021 03:34 PM IST
Imd issues red alert forecasts heavy rains for three days in telangana

తెలంగాణలో భారీ వర్షాలకు పలు గ్రామాలు, కాలనీలతో పాటు లోత్టటు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూన్ నుంచి రాష్ట్రాన్ని తడిసి ముద్దచేసిన వరుణుడు ఆ తరువాత జూలై, ఆగస్టు మాసాల్లో విస్తారంగా కురువడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. హైదరాబాద్ కు తాగునీరు అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులు కూడా జలకళను సంతరించుకున్నాయి. ఇక ఈ నెల ప్రారంభం నుంచీ కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా స్థంభించింది. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది భారత వాతావరణ కేంద్రం.

రానున్న 48 గంటల పాలు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని 16 జిల్లాలతో పాటు పలుప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురిసే అవశాం వుందని హెచ్చిరకలు జారీచేసింది. ప్రస్తుతం గాలులతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. రుతుపవనాల ద్రోణి.. ఢల్లీ, బాలంగీర్‌, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. సోమవారం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధి సహా శివారు మున్సిపాలిటీ ప్రాంతాల్లోనూ రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కు ఆరెంజ్ వర్ష సూచనను జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా జిల్లా అధికారులతో పాటు గ్రేటర్ అధికారులకు పలు అదేశాలను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు నీళ్లు ప్రవాహంతో ప్రభావితం అయ్యే ప్రాంతాల్లో అత్యవసర చర్యలు తీసుకునేందుకు రెస్క్యూ బృందాలు సిద్దంగా వుండాలని అదేశించింది. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ప్రభావంతో.. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురసే అవకాశముందని తెలిపింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడ లోతట్టుప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సోమవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.

మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles