Actress Himaja shares miraculous incident with fans నటి ఇంట్లో అద్భుతం.. అనుభూతిని పంచుకున్న హిమజ

Actress himaja shares miraculous incident happened at home

Himaja TV actress, Himaja actress, shirdi sai baba, himaja miraculous incident, Himaja sai baba, sai baba vibhudhi, Hyderabad, Telangana

Actress Himaja shares miraculous incident with fans that happened at her home, saying this is video is made only to share the Experience but not to make belive the presence of almighty.

ITEMVIDEOS: నటి ఇంట్లో అద్భుతం.. అనుభూతిని పంచుకున్న హిమజ

Posted: 09/01/2021 10:29 AM IST
Actress himaja shares miraculous incident happened at home

బిగ్‌బాస్ ఫేం, నటి హిమజ.. తన ఇంట్లో అద్భుతం జరిగిందంటూ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వినాయకుడి విగ్రహం పాలు తాగింది… సాయి బాబా విగ్రహం నుంచి విభూది వస్తుంది , కొన్ని విగ్రహాలు కళ్ళు తెరచాయి అన్న వార్తల మాదిరిగా ఈ విషయం వున్నా.. ఇది అలాంటి వార్తలను విపరీత ప్రచారం చేసేందుకు పూనుకుని తాను ఈ వీడియోను రూపోందించలేదని.. కేవలం తన అనుభూతిని మాత్రమే పంచుకునేందుకు ఈ వీడియోను తీశానని నటి తేల్చిచెప్పింది. భగవంతుడిని శ్రద్దతో నమ్మితే తాను ఉన్నానని, తాను అంతా చూస్తున్నానని భక్తులకు విశ్వాసం కల్పించేందుకు ఇలా అప్పడప్పుడూ తన మహిమలను చూపుతాడని అంటోందీ ఈ నటి.

అసలు ఇంతకీ అమె ఇంట్లో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా..? తమ ఇంట్లో ఉన్న ఒక సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలుతోందని హిమజ వెల్లడించింది. అలాగే బాబా విగ్రహం ముందు ఉంచిన నీరు తులసి వాసన వస్తోందని తెలిపింది. అయితే ఇది కొత్తగా తమ ఇంట్లోకి వచ్చిన విగ్రహం కాదని, తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో షిరిడీకి వెళ్లినప్పుడు అక్కడి నుంచి తీసుకువచ్చిన విగ్రహమని తెలిపింది. సాయిబాబా పై నున్న అమితమైన భక్తితో తాను ఆ విగ్రహానికి చిన్న కిరీటంతో పాటు పూలదండను కూడా అలంకరించానని తెలిపింది. అయితే ఈ విగ్రహం తమ ఇంట్లోకి వచ్చిన కొన్నాళ్లకు తమకు రమణానంద మహర్షి స్వామిజీతో పరిచయం ఏర్పడిందని తెలిపింది.

దీంతో రమణానంద మహర్షి స్వామీజి 2004లొ.. తమ ఇంట్లో ఉన్న బాబా విగ్రహానికి 19 రోజుల హోమం చేసినట్లు గుర్తుచేసుకుంది. అప్పటి నుంచి ఈ సాయిబాబా విగ్రహాన్ని ప్రతిరోజు తుడవడం, ఆ విగ్రహం ముందున్న నీటిని మార్చడం తన దినచర్యగా మారినట్లు ఆమె చెప్పింది. ఈ క్రమంలో తాజాగా విగ్రహం తుడవడానికి వెళ్తే.. దాని చుట్టూ విభూది కనిపించిందని ఆమె వెల్లడించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ సీరియల్ నటి.. తాను ఎవర్నీ నమ్మించడానికి వీడియో చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటివి జీవితంలో అనుభవంలోకి వస్తేనే ఎవరికైనా తెలుస్తుందన్న ఆమె.. తన అనుభూతిని చెప్పుకోవడానికి మాత్రమే వీడియో చేసినట్లు వివరించింది. పలు టీవీ సీరియల్స్‌లో నటించిన హిమజ చాలా మందికి సుపరిచితురాలే. అయితే బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles