young man sets police chowki on fire to get jailed పోలీసులకు సవాలు విసరుతున్న దొంగ..

Tech savvy delhi car thief who stole over 100 cars now challenges hyderabad cops

luxury cars, park Hyatt, car robbery, Satyendra Singh Shekawat, interstate luxury car thief from delhi, crime news, kannada producer majunath car stolen from Park Hyatt, park hyatt car thief,Tech Savvy Delhi Car Thief Shekavat,Park Hyatt theft, Banjara hills, Hyderabad, Car Theft, Hyderabad, Crime News

Hyderabad Police are having a tough time catching a tech-savvy car thief accused of stealing luxury cars in the city. It may be recollected that on the night of January 26th at the Park Hyatt Hotel in the upmarket Banjara Hills, Kannada producer V. Manjunatha's Fortuner car, bearing no KA04 MX1 1000 was stolen. Later two more cars were stolen on May 5th in Bowrampet at Nacharam police station limits.

ఈ చోరుడు దొరికితే చిత్తడే.. పోలీసులకు సవాలు విసరుతున్న దొంగ..

Posted: 08/31/2021 08:21 PM IST
Tech savvy delhi car thief who stole over 100 cars now challenges hyderabad cops

ఓ దొంగ ఏకంగా పోలీసులకే సవాలు విసురుతున్నాడు. నేను మీకు దొరకను.. నాకు నేనుగా లొంగిపోతేనే మీకు దొరికినట్లు అంటున్నాడు. అంతేకాదు నన్ను పట్టుకోవడం మీవల్ల కాదని చెబుతున్నాడు. ఎందుకంటే.. ఆ దోంగ పోలీసుల టెక్నాలజీ కంటే ఐదేండ్లు ముందున్నాడట. ఈ సవాలు ఏదో ఒక రాష్ట్ర పోలీసులకే అనుకుంటూ పోరబాటే’.. పలు రాష్ట్రాల పోలీసులకు ఇదే సవాల్‌ విసురుతూ తన పనికానిస్తూ ఎంచక్కా రాష్ట్రాలకు రాష్ట్రాలు తిరిగేస్తున్నాడు. ఇతడిని పట్టుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకోండపోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు మరికొన్ని రాష్ట్రాల పోలీసులు కూడా ఇతడ్ని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినా ఫలితం మాత్రం లేదు.

ఇంతకీ ఈ దొంగ ఎవరు అంటారా.? ఆయనే రాజస్థాన్ కు చెందిన సత్యేంద్రసింగ్‌ షెకావత్‌. ఈయన పోలీసులకు ఎందుకని సవాలు విసరుతున్నాడంటే.. ఈయన చేసేది కార్ల దొంగతనం. ఏదో చిన్నచితకా కాదు.. ఈయన దృష్టంతా లగ్జరీ కార్లపైనే. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లను టార్గెట్ చేసుకుని సత్యేంద్రసింగ్ దొంగతనాలకు పాల్పడతాడు. ఎంబీఏ చదివిన ఈయనకు టెక్నాలజీపై పట్టుంది. స్కానింగ్‌ పరికరం, ఎలక్ట్రానిక్‌ కీ కట్టర్‌ సహాయంతో జీపీఎస్‌ పరికరానికి సంబంధించిన లింక్ ను కట్‌ చేసి చోరీ చేస్తాడు. గతంలో ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ పోలీసులకు దొరికిపోయిన ఇతగాడు మరోసారి చిక్కకుండా ముందస్తు జాగ్రత్తలపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు.

పలు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన సత్యేంద్రసింగ్.. దేశంలోని ప్రధాన పట్టణాల్లో సుమారు 60 కార్లను తస్కరించాడు. ఈ ఏడాది జనవరిలో బంజారాహిల్స్ లోని పార్క్‌ హయత్‌ వద్ద బెంగళూరుకు చెందిన కన్నడ సినీ నిర్మాత మంజునాథ్‌ ఫార్చునర్‌ వాహనాన్ని పార్కింగ్‌ స్థలం నుంచి అపహరించాడు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా.. కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు వెళ్లి.. తిరిగి సిటీకి వచ్చాడు. ఔటర్‌ రింగ్‌ ప్రాంతంలో రెండు మూడు రోజులు పార్కింగ్‌ చేసి.. అక్కడి నుంచి కారు కన్పించకుండా చేశాడు. దర్యాప్తులో భాగంగా బంజారాహిల్స్‌ పోలీసులు నగరంలోని సీసీ కెమెరాలు వెతకడంతో కారు ఎక్కడ తిరిగిందనే విషయాన్ని ఆరా తీశారు. దొంగ జైపూర్‌కు చెందిన వాడని గుర్తించి అక్కడకు వెళ్లారు.

జైపూర్‌లో నిందితుడి ఇంటిని గుర్తించి అక్కడకు వెళ్లిన బంజారాహిల్స్‌ పోలీసులకు సత్యేంద్ర ఊహించని షాక్‌ఇచ్చాడు. దర్యాప్తు అధికారులకు వాట్సాప్‌ కాల్‌ చేసి.. ‘సార్‌ కంగ్రాట్స్‌ నన్ను గుర్తించి మా ఇంటి వరకు వచ్చారు. నేను మీకు దొరకను.. నన్ను పట్టుకోవడం మీతరం కాదు.. ఇంత దూరం వచ్చారు.. జైపూర్‌ అందాలను చూసి, ఫలాన హోటల్‌లో మంచి భోజనం దొరుకుతుంది తిని వెళ్లండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ‘అయితే మీరు మాకు అతిథులు.. గంట సమయం ఇస్తే నా భార్యనే మంచి భోజనం తయారు చేసి పెడుతుందం’టూ మాట్లాడాడు. ‘నా ఇంటిని గుర్తించి వచ్చినందుకు.. మీకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా’.. అంటూ.. అధికారితో కాల్‌ కట్‌ చేశాడు.

ఏప్రిల్‌లో రాచకొండ నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చెందిన కారును అపహరించాడు. బంజారాహిల్స్‌ పోలీసులతో సమాచారం తీసుకున్న నాచారం పోలీసులు, ప్రధాన దొంగకు సహకరిస్తున్న అతడి భార్యను జైపూర్‌ వెళ్లి అరెస్ట్‌ చేయగా, ఆమె బెయిల్‌ పొందడంతో తిరిగి వచ్చేశారు. ఇంతలో ఆగస్టు 5న బౌరంపేట్‌లో ఓ ఫార్మా కంపెనీకి చెందిన వైస్‌ ప్రెసిడెంట్‌ కారు చోరీకి గురైంది. దీనిని కూడా ఆ దొంగే అపహరించాడని పోలీసులు భావిస్తూ..ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఎన్నో సంచలనాత్మకమైన కేసుల చిక్కుముడి విప్పిన పోలీసులకు.. ఈ టెక్నాలజీ దొంగ విసురుతున్న చాలెంజ్‌ను ఎలా ఎదురుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు.

మరోసారి బంజారాహిల్స్‌ పోలీసులు జైపూర్‌ వెళ్లి దొంగ కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు ఈ విషయాన్ని గుర్తించి ‘సార్‌ నమస్తే.. మరోసారి మీరు జైపూర్‌కు వచ్చారా? అయితే నేను ఇప్పుడు బెంగళూర్‌లో ఉన్నా’ అంటూ వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడాడు. పోలీసుల టెక్నాలజీ కంటే నేను ఐదేండ్ల ముందున్నా.. మీరు నా టెక్నాలజీకి చేరుకునే వరకు నేను మరో ఐదేండ్లు ముందుంటా.. నన్ను పట్టుకోలేరం’టూ మరోసారి చాలెంజ్‌ విసిరాడు. ‘మీరు పట్టుకోవాలంటే ఇప్పుడు నేను బెంగళూర్‌లో ఒక గంట సేపు ఉంటా.. దమ్ముంటే పట్టుకోండి..మీరు జైపూర్‌ నుంచి రావడానికి కనీసం రెండు రోజులు పడుతుందం’టూ హేళనగా మాట్లాడి కాల్‌ కట్‌ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles