Leopard attacks model in German photoshoot బోనులోకి వెళ్లి మోడల్ ఫోటో షూట్.. పంజా పవర్ చూపిన చిరుతలు

German model attacked by leopard during photoshoot probe underway

German model, Jessica Leidolph, animal lover, attacked, leopard, Nebra animal home, Saxony-Anhalt, eastern Germany, Germany

A GERMAN model, animal lover Jessica Leidolph has been left scarred for life after being attacked by a leopard, during a photoshoot. The 36-year-old was attacked at a retirement home for show animals in Nebra, eastern Germany. After entering the enclosure, she was assaulted by Troja, a 16-year-old leopard. Ms Leidolph was bitten repeatedly around her head, and ended up losing consciousness.

బోనులోకి వెళ్లి మోడల్ ఫోటో షూట్.. పంజా పవర్ చూపిన చిరుతలు

Posted: 08/28/2021 05:38 PM IST
German model attacked by leopard during photoshoot probe underway

అందివచ్చిన సాంకేతిక నేపథ్యంలో ఫోటో షూట్ కూడా సర్వసాధాణంగా మారిపోయింది. ఒకప్పుడు వేడుకలకు మాత్రమే జరిగే ఈ తంతు ఇప్పుడు అందుకోసమే ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించేంత వరకు వెళ్లింది. పుట్టినరోజులకు, పెళ్లిళ్లకు ఫోటో షూట్ లో హడావిడి పెరిగింది. దీని కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక ఫోటోలో, సెల్ఫీలు దిగి వాటిని నెట్టింట్లో పెట్టి లైకుల కోసం కూడా నేటి యువత పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు. ఇక ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఇక మోడళ్లు, సెలబ్రిటీల ఫోటో షూట్ కు డిమాండ్ పెరిగింది.

కొంత సాహసం, కొంత ధైర్యంతో కూడిన ఫోటోలు దిగడానికి కూడా వీరు సమ్మతిస్తున్నారు. ఇలా ఓ మోడల్ ఫోటో షూట్ కోసం ఏకంగా పెద్ద సాహసమే చేసి ప్రాణాలపైకి తెచ్చుకుంది. ఏకంగా చిరుత పులుల బోనులో దూరి.. ఫోటో షూట్ చేస్తుండగా అందులో వున్న రెండు చిరుతలు ఆమెపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఆమెకు గాయాలైన ఘటన జర్మనీలోని ప్రైవేటు ప్రాపర్టీలో ఫొటోషూట్ లో జరిగింది. జంతు ప్రేమికురాలిగా పాప్యులర్ అయిన జర్మనీ 36 ఏళ్ల మోడల్ జెస్సికా లేడాల్ఫ్‌పై ఫోటోషూట్ చేస్తుండగా చిరుతలు దాడి చేశాయి.

తూర్పు జర్మనీలోని నెబ్రాకు జెస్సికా చెందిన బిర్గిట్ స్టేచ్ అనే 48 ఏళ్ల మహిళ ఒక జంతువుల షెల్టర్ నడుపుతోంది. స్వతహాగా జంతు ట్రైనర్ అయినా ఆమె.. అడ్వర్‌టైజింగులకు, షోలలో కొన్నాళ్లు ఉపయోగించి ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేసిన జంతువులను బిర్గిట్ షెల్టర్‌లో పెంచుతుంది. అలా ఆమె దగ్గరకు ట్రాయ్, పారిస్ అనే రెండు చిరుతలు రాగావాటిని కూడా పెంచుతోంది. ఈ క్రమంలో చిరుతలు ఉన్న బోనులోకి వెళ్లిన జెస్సికా ఫొటోషూట్‌ ప్రారంభించింది. దీంతో కొంత సేపు నిమ్మకుండిన చిరుతలు ఒక్కసారిగా లేచి మోడల్ జెస్సికాపై దాడి చేశాయి. దీంతో ఆమెను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు.

చిరుతల దాడిలో తీవ్రంగా గాయపడిన జెస్సికాకు ప్రాణాపాయం మాత్రం లేదు. అయితే అమెకు తలపై, ముఖంపై, చేతులపై చిరుతలు దాడి చేశాయి. దీంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని.. ఆమె శరీరంపై గాట్లు ఇంకా తగ్గలేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై మోడల్ జెస్సికా మాట్లాడుతు..షూట్ జరిగే సమయంలో చిరుతల నా బుగ్గలు, చెవి, తలను కొరుకుతూనే ఉన్నాయి తాపీగా చెబుతోంది. కాగా..ఈ ఈ ఫొటోషూట్ ఎవరు నిర్వహించారు? అనేది తెలియరాలేదు. కానీ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. ప్రజలకు ఎటువంటి ఆందోళన పడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. ఈ దాడి చేసిన రెండు చిరుతలు కొన్ని వ్యాపార ప్రకటనల్లో కనిపించినట్లుగా సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles