Bride slaps groom for chewing gutka during wedding rituals పెళ్లిమండపంలోనే వరుడుని చెంపెపై కోట్టిన వధువు

Bride slaps groom for chewing gutka during wedding rituals video goes viral

Hilarious video, Hilarious movement, Bride Beats Groom, Bride Beats Groom For Chewing Gutka, groom chews gutka gets slaped by bride, bride slaps groom on wedding mandap, groom chews gotka during wedding rituals, Bride, Groom, Tobacco, Wedding Mandap, Wedding Rituals, viral video

A video of bride slapping the groom for chewing gutka during wedding has gone viral on social media. According to the video, she got angry on seeing that her husband is chewing tobacco. He immediately stood up and walked for some distance to spit the tobacco after she slapped him.

ITEMVIDEOS: పెళ్లిమండపంలో వరుడ్ని చెంపపై కోట్టిన వధువు.. నవ్వు అపుకోలేరు..

Posted: 08/28/2021 04:36 PM IST
Bride slaps groom for chewing gutka during wedding rituals video goes viral

వైరల్ వివాహ వీడియోలతో ఇంటర్నెట్ ప్రేమలో పడినట్లుంది. ఈ మధ్యకాలంలో వైరల్ వెడ్డింగ్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. బుల్లెట్ బండెక్కి వస్తా అన్న పెళ్లి బరాత్ సాంగ్ తో పాటు వెళ్లి రిసెప్షన్ లో వరుడికి వధువు ముద్దు పెట్టే వీడియోతో పాటు అనేక వీడియోలు ఆన్ లైన్లో నెటిజనులను ఆనందింపజేస్తున్నాయి. ఈ తరహా సరదా, వినోదాత్మక పోస్టులు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో పాత వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక మరికొన్ని నవ్వు అపుకోలేని వీడియోలు కూడా నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కోడుతున్నాయి.

తాజాగా అలాంటిదే ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడయో విపరీతంగా హల్ చల్ చేసింది, అంతలా హల్ చల్ చేస్తున్న వీడియో ఏమీటా.? ఇందులో ఏమిటా విచిత్రం అంటారా.? పెళ్లి మండపంలో వివాహ వేడుక మంత్రోచ్చరణలు జరుగుతుండగా వధువు ఏకంగా వరుడిని చెంపదెబ్బ కోట్టేసింది. ఔనా.? అంటారా.? అందుకుముందు అదే పని పెళ్లి జరిపించే పండితుడిపై కూడా చేసింది. అయినా అక్కడున్నవారితో పాటు నెటిజనులు కూడా వధువుకే మద్దతు పలికారు. అమెకు కోపం రావడంలో అర్థం వుందని అంటున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు కోట్టిందన్న మ్యాటర్లోకి ఎంటరైతే..

పెళ్లి కార్యక్రమంలో కోసం వధూవరులు మండపంలో కూర్చోగా ఒక్కసారిగా పంతులుగారు.. మంత్రాలు ఆపండీ అన్న శబ్దం వినిపింది. అదేంటి అని చూడగా.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు ఏకంగా పెళ్లి కూతురు. దాంతో పండితుడు మంత్రాలను అపారు. వెంటనే అమె మీరు పోగాకు నములుతున్నారా.? అని ప్రశ్నించింది. పండితులు అలాంటిదేం లేదు అంటూ అబద్దాలు ఆడబోయాడు. కానీ తాను నములున్న విషయాన్ని పసిగట్టిన వధువు అతడిపై కసురుకుని తరువాత ఏకంగా అతడ్ని కోట్టింది. ఈ లోపు పక్కనే వున్న వరుడు కూడా పండితుడికి వేలు చూపుతూ.. ఏదో చెప్పబోయాడు.

అంతే పండితుడు తనపై నుంచి దృష్టిని మొత్తంగా వరుడిపైకి తరలించేపని చేశాడు. ఇదిగో అమ్మాయ్.. నీకు కాబోయే భర్త (వరుడు) గుట్నా నములుతున్నాడని అన్నాడు. అది చూపి వెంటనే అమె వరుడి చెంపపై కోట్టింది. పెళ్లి వేదికపైన మంత్రోచ్ఛరణలు జరుగుతుంటే పవిత్రంగా వుండాల్సిన చోట గుట్నా నములుతావా.? అంటూ కోట్టేసింది. అంతటితో ఆగకుండా వెంటనే లేసి గుట్నాను ఊసేయ్ అంటూ గదిమింది. అప్పటికే వధువు చేసిన పనితో విస్తుపోయిన వరుడు.. చేసేది లేక.. బిక్కముఖం వేసుకుని లేచి నోట్లోని గుట్కను ఊసేసాడు. ఇది చూసిన పెళ్లికి హజరైన బంధువలు ఫళ్లున నవ్వారు. ఈ వీడియో చూస్తూ మీరు నవ్వు ఆపుకోలేు. ఎందుకు ఆలస్యం.. కానిచ్చేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bride  Groom  Tobacco  Wedding Mandap  Wedding Rituals  viral video  Hilarious video  Trending video  

Other Articles