కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రపంచంపై తన ప్రభావాన్ని చాటుతొంది. భారత్ లో తొలిగా వెలుగుచేసిన కరోనా డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. కరోనా డెల్టా వేరియంట్ అతివేగంగా వ్యాప్తిస్తూ.. అగ్రరాజ్యం అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో విలయ తాండవం సృష్టిస్తోంది. ఈ క్రమంలో డెల్టా వేరియంట్ పై కీలకమైన ప్రకటన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. గతంలోని వేరియంట్ల కన్నా ఇది చాలా వేగంగా ప్రబలుతోందని
ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు వేరియంట్లు ప్రమాదకరంగా ఉండగా, అతి త్వరలో డెల్టా వేరియంట్ ఈ జాబితాలో తొలిస్థానానికి చేరుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. డెల్టా కేసులు పెరగడం వల్ల పలు దేశాల్లో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతున్నాయని చెప్పింది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో పరిస్థితులు అంత బాగాలేవని తెలిపింది. ఈ వేరియంట్‌ను నియంత్రించడం కోసమైనా ప్రపంచంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.
ఇదే క్రమంలో 7.7 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ర్యాపిడ్ ఏసీటీ-ఆక్సిలరేటర్ డెల్టా రెస్పాన్స్ (రాడార్)గా పిలిచే ఈ పథకాన్ని వచ్చే నాలుగు నెలల్లో ఆమోదించాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. ఈ ఆమోదం లభిస్తే కరోనా టెస్టులు చేసే సామర్థ్యాన్ని పెంచడంతోపాటు భవిష్యత్తులో వచ్చే మరిన్ని కొత్త వేరియంట్లను ముందుగానే గుర్తించవచ్చని ఈ సంస్థ పేర్కొంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మరింత ఆక్సిజన్ అందించవచ్చని, ఆరోగ్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందించడం కుదురుతుందని తెలిపింది.
ఈ రాడార్ పథకం కొత్తదేమీ కాదని, ఏసీటీ-ఆక్సిలరేటర్‌కు ప్రతిపాదించిన మొత్తం 2021 బడ్జెట్లో భాగమని చెప్పింది. 2020 మొత్తంలో నమోదైన కరోనా కేసుల కన్నా 2021 తొలి 5 నెలల్లోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు కరోనా వేరియంట్లు ప్రబలుతున్నాయని, అయితే వీటికన్నా ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు ఇంకా పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more