India announces emergency e-visa for Afghans ఆఫ్ఘ‌నిస్థాన్ ఆర్తుల కోసం.. భారత్ ఎమర్జెన్సీ ఈ-వీసా జారీ

India introduces e emergency x misc visa in view of current situation in afghanistan

afghanistan, taliban, india, e-visa, e-Emergency X-Misc Visa, afghans, emergency e-visa, emergency visa, visa applications

India on August 17 announced that it will issue an emergency e-visa to Afghan nationals who want to come to the country in view of the prevailing situation in Afghanistan after the Taliban captured power there.

ఆఫ్ఘ‌నిస్థాన్ ఆర్తుల కోసం.. భారత్ ఎమర్జెన్సీ ఈ-వీసా జారీ

Posted: 08/17/2021 05:42 PM IST
India introduces e emergency x misc visa in view of current situation in afghanistan

ఆఫ్ఘ‌నిస్తాన్‌  లో చిక్కుకున్న వారిని వీలైనంత త్వ‌ర‌గా ఇండియాకు ర‌ప్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ఎమ‌ర్జెన్సీ వీసా ప‌ద్ధ‌తిని ప్ర‌క‌టించింది. అఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న సంక్షోభంతో ఆ దేశంలోని పౌరులు ఇతర దేశఆలకు వలస వెళ్లడం.. ఆ దేశం పూర్తిగా తాలిబన్ ఉగ్రవాదుల కబంధహస్తాల్లోకి వెళ్లిపోవడంతో భారత్ ఆక్కడి ఆర్తులను అదుకునేందుకు యుద్దప్రాతిపదికన ముందుకు వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ ప‌ద్ధ‌తిలో ఇండియాలో ఆశ్ర‌యం పొందాల‌నుకునేవారికి ఆ వీసాల‌ను జారీ చేయ‌నున్నారు.

ఈ-ఎమర్జెన్సీ ఎక్స్ మిస్లీనియస్ “e-Emergency X-Misc Visa పేరుతో కేంద్ర హోంశాఖ ఆ వీసాల‌ను జారీ చేయ‌నున్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి భార‌త్ చేరుకోవాల‌నుకునేవారికి ఆ వీసా ద్వారా అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అయితే హిందువులు, సిక్కుల‌కు ఈ-వీసాలో తొలి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్ ఫైట‌ర్లు చేజిక్కించుకున్న నేప‌థ్యంలో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాది సంఖ్య‌లో జ‌నం కాబూల్ విమానాశ్ర‌యానికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌లో అయిదుగురు మ‌ర‌ణించారు.

ఆఫ్ఘ‌నిస్తాన్ సంక్షోభంపై ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడారు. ఆఫ్ఘ‌న్ శ‌ర‌ణార్థుల‌కు ప్ర‌పంచ దేశాలు ఆశ్ర‌యం క‌ల్పించాల‌న్నారు. ఆఫ్ఘ‌న్ శ‌ర‌ణార్ధుల‌ను అన్ని దేశాలు ఆహ్వానించాల‌ని, వారిని డిపోర్ట్ చేయ‌రాదు అని ఆయ‌న ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని దేశాలు ఆశ్ర‌యం క‌ల్పించేందుకు అంగీక‌రించాయి. 20 వేల మంది పేద ఆఫ్ఘ‌న్ల‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌నున్న‌ట్లు కెన‌డా చెప్పింది. మ‌రోవైపు కాబూల్‌లో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని మూసివేన‌ట్లు భార‌త్ ప్ర‌క‌టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles