Suspicious movements around YS Sunitha’s house వైఎస్ సునీత ఇంటిముందు రెక్కీ నిర్వహించిన వ్యక్తి..

Police arrested one whose movements were suspicious ys sunitha s house

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, Suneetha, security threat, suspiciours movements, Pulivendula, YSRCP state secretary, Devireddy SivaShanker Reddyy, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, kadapa, andhra pradesh, crime, Politics

YS Vivekananda Reddy daughter Suneetha Narreddy, has written to the police expressing concerns over a security threat to her family. Suneetha wrote to the Kadapa district Superintendent of Police, seeking a threat analysis for her family in the wake of alleged suspicious movements near her residence in Pulivendula.

వైఎస్ సునీత ఇంటిముందు రెక్కీ నిర్వహించిన వ్యక్తి.. పోలీసుల అదుపులో..

Posted: 08/14/2021 06:59 PM IST
Police arrested one whose movements were suspicious ys sunitha s house

మాజీ మంత్రి దివంగత‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం విచారణ జ‌రుపుతూ కీల‌క విష‌యాల‌ను రాబ‌డుతోన్న నేప‌థ్యంలో  తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయ‌న‌ కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. కేసులో నిందితులు ఎవరన్నది ఇప్పుడిప్పుడే సీబిఐ నిగ్గుతేల్చతూ.. కేసు విచారణను వేగం చేస్తోంది. ఈ క్రమంలో కేసును ఇంతటితో వదిలిపెట్టాలని తనకే బెదిరింపులు వస్తున్నాయని తనను బెదిరిస్తున్నారంటూ వైఎస్ వివేకా తనయ సునిత పోలీసులను ఆశ్రయించారు.

అంతేకాదు తమ ఇంటి ముందు ఓ వ్య‌క్తి అనుమానాస్పదంగా తిరుగాడుతున్నారని గమనించిన అమె.. తమ ఇంటి ముందు అనుమానిత వ్యక్తి రెక్కీ నిర్వ‌హిస్తున్నాడని జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశారు. ఈ నెల 10న‌ ఒక అనుమానితుడు త‌మ‌ ఇంటి చుట్టూ తిరిగాడ‌ని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత‌ ఫిర్యాదులో పేర్కొన‌డంతో దీనిపై దృష్టి సారించిన పోలీసులు అత‌డిని గుర్తించారు. నిందితుడిని మ‌ణికంఠ రెడ్డిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప జిల్లా ఎస్పీకి వైఎస్‌ సునీతా రెడ్డి లేఖ రాశారు.

తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌ చేశాడని లేఖలో సునీత పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని వివరించారు.

కాగా, శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాల దృష్ట్యా శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని ఆమె జిల్లా ఎస్పీని కోరారు. అయితే, వివేకా హత్య కేసులో ఈ రోజు సీబీఐ విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు.అత‌డిని డీఎస్పీ శ్రీ‌నివాసులు విచారిస్తున్నారు. మణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబిఐ అధికారులు కూడా మణికంఠరెడ్డిని విచారించే అవకాశాలు వున్నాయని సమారారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles