Covaxin, Covishield mixing: Cocktail vaccine safe వాక్సీన్ మిక్సింగ్ పై ఐసీఎంఆర్, ఎన్ఐవి అధ్యయనం..

Icmr study finds combination of covishield and covaxin safe

covaxin, covishield, cocktail, mixing vaccine, covaxin covishield mixing, covid vaccines mixing, coronavirus vaccine mixing, covid vaccine mixing result, icmr, india covid 19 vaccines, safe, more immune to covid variants, coronavirus, Covid-19

A study by ICMR has revealed that mixing and matching of Covaxin and Covishield vaccines was not only safe but also gave better immunity against the variant strains of SARS-CoV-2.

వాక్సీన్ మిక్సింగ్ పై ఐసీఎంఆర్, ఎన్ఐవి అధ్యయనం.. ఏం చెప్పిందంటే..

Posted: 08/09/2021 03:09 PM IST
Icmr study finds combination of covishield and covaxin safe

కరోనా వైరస్‌ మహమ్మారి క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రపంచంపై తన ప్రభావాన్ని చాటుతున్న తరుణంలో దానిని సమూలంగా అంతం చేయడానికి పరిశోధనలు కోనసాగుతూనే వున్నాయి. ఇప్పటివరకు పలు దేశాలు పలు రకాల వాక్సీన్లను తీసుకువచ్చినా.. అవన్నీ కరోనాను కట్టడి చేయడానికే. కాగా కరోనాను అంతం చేసేందుకు సరైన వాక్సీన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ వాక్సీన్లు కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక పలు దేశాల్లో ఇదివరకే వాక్సీన్ మిక్సింగ్ కూడా చేస్తున్నారు.

అయితే వాక్సీన్ మిక్సింగ్ ఫలితాలు మరింత ధీటుగా కరోనా మహమ్మారిని ఎదుర్కోనేందుకు దోహదపడుతోందని, వీటి వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోంటున్నాయని తాజాగా అధ్యయన పలితాలు వెల్లడిస్తున్నాయి, ఇప్పటికే పలు దేశాల్లో ఈ మేరకు ప్రయోగాలు ఊపందుకోగా, తాజాగా భారతదేశంలోనూ వాక్సీన్ మిక్సింగ్ పై నివేదికలు వెల్లడయ్యాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్).. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) పూణే తాజాగా చేసిన అధ్యయనాలు కూడా ఊరటను కలిగించే ఫలితాలనే వెల్లడిస్తున్నాయి.

దేశంలో ఆది నుంచి అందుబాటులో వున్న కొవాగ్జిన్‌ (బయోఎన్ టెక్), కొవిషీల్డ్‌ (విదేశాల్లో ఆస్ట్రాజెనెకా) టీకాలను వేర్వేరుగా ఒక్కో డోసు చొప్పున తీసుకోవడం సురక్షితమేనని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీ అధ్యయనం వెల్లడించింది. ఒకే రకమైన టీకా రెండు డోసులను తీసుకున్నవారితో పోల్చితే.. రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకున్నవారిలో రోగనిరోధకశక్తి అధికంగా పెంపొందుతున్నట్టు వివరించింది. ఆల్ఫా, బీటా, డెల్టా వంటి వేరియంట్లపై ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబర్చిందని పేర్కొంది. కాగా టీకా మిక్సింగ్ పై జరిపిన అద్యయనాలను మరింతగా సమీక్షించాల్సి ఉంది. ఈ వివరాలు ప్రీ-ప్రింట్‌ సర్వర్‌ ‘మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీ’లో ప్రచురితమయ్యాయి.

ఉత్తరప్రదేశ్లో సిద్ధార్థ్ నగర్‌లోని ఓ టీకా కేంద్రంలో సిబ్బంది చేసిన పోరబాటుతో అథ్యయనానికి తెరలేచింది. 18 మందికి తొలి దఫాలో కొవిషీల్డ్‌.. రెండో దఫాలో కొవాగ్జిన్‌ టీకాను పొరపాటున వేశారు. దీంతో ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీకి చెందిన నిపుణుల బృందం వీరిపై అధ్యయనం చేసింది. ఈ క్రమంలో రెండు డోసుల కొవాగ్జిన్‌, రెండు డోసుల కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారిని 40 మంది చోప్పున ఎంచుకుని.. టీకాల మిక్సింగ్ తీసుకున్న 18 మందిపై మే, జూన్‌, 2021లో అధ్యయనం నిర్వహించారు. దీంతో రెండు డోసుల ఒకే టీకా తీసుకన్నవారిి కన్నా మిక్సింగ్ టీ్కాలు తీసుకున్న 18 మందిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా వృద్ధి చెందినట్టు పరిశోధకులు గుర్తించారు.

టీకా మిక్సింగ్ తో కొన్ని లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక కంపెనీకి చెందిన టీకా అందుబాటులో లేని సమయంలో రెండో డోసుగా వేరే సంస్థ టీకాను వేసుకోవచ్చు. దీంతో టీకా ప్రక్రియలో జాప్యాన్ని నివారించవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్‌ సామర్థ్యం మరింత పెరగాల్సిన అవసరమున్నదని, మిక్సింగ్‌ టీకాతో అది మరింత సులభమవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా,  కొవాగ్జిన్‌ టీకాను ఇన్‌యాక్టివేటెడ్‌ వైరస్‌ను ఉపయోగించి, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఎడినో వైరస్‌ వెక్టార్‌ సాంకేతికత సాయంతో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covaxin  covishield  cocktail  mixing vaccine  safe  more immune to covid variants  coronavirus  Covid-19  

Other Articles