Threat to human rights is highest in police stations: CJI పోలీసుల ధర్డ్ డిగ్రీపై సీజేఐ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు

Threat to human rights highest in police stations cji nv ramana

Human rights, Chief Justice of India N V Ramana, Ramana, free legal aid services, Lalit, legal services, Bar Councils, Crime

The threat to human rights is the highest in police stations as custodial torture and other police atrocities still prevail in India and even the privileged are "not spared third-degree treatment", Chief Justice of India N V Ramana said on Sunday while batting for a nationwide effort for the "sensitisation of police officers.

పోలీసుల ధర్డ్ డిగ్రీపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

Posted: 08/09/2021 12:52 PM IST
Threat to human rights highest in police stations cji nv ramana

దేశంలోని పోలిస్ స్టేషన్లలో ఇప్పటికీ మానవ హక్కులకు, మనిషి గౌరవానికి అత్యధిక ముప్పు’ ఏర్పడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న తరుణంలో జరిగే కస్టోడియల్ చిత్రహింసలతో పాటు పోలీసుల దౌర్జన్యాలు కూడా ఇంకా స్వతంత్ర భారతావనిలో రాజ్యమేలుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులోకి వెళ్లిన విశేషాధికారం వున్నవారు కూడా వారి ధర్డ్ డిగ్రీ చర్యలకు అతీతులు కారని ఆన అన్నారు, మానవహక్కులు, గౌరవం అనేవి ‘పవిత్రమైనవని’ ఆయన పేర్కోన్నారు.

‘‘రాజ్యాంగపరమైన నిర్దేశాలు, హామీలు ఉన్నప్పటికీ ఠాణాలలో మాత్రం న్యాయపరమైన ప్రాతినిధ్యం లేకపోవడం అరెస్ట్/నిర్బంధంలో ఉన్నవారికి పెనుశాపంగా మారుతోంది. నిందితుడు తొలి గంటల్లో తీసుకున్న నిర్ణయాలు తర్వాత తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. పోలీసుల మితిమీరిన చర్యలకు నియంత్రణలో ఉంచేందుకు రాజ్యాంగ హక్కులు, ఉచిత న్యాయ సేవల లభ్యతపై ప్రజలకు సమాచారాన్ని అందించడం.. విరివిగా ప్రచారం చేయడం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) నిర్వహించిన పోలీసు అధికారుల సంచలనాలు అనే అంశంపై అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు,
 
ఇటీవల వచ్చిన వార్తలను బట్టి చూస్తుంటే విశేషాధికారాలు ఉన్న వారు కూడా థర్డ్-డిగ్రీకి అతీతులు కారని అర్థమైందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. అయితే, ఆయన ప్రత్యేకంగా ఏ కేసునూ ఉదహరించలేదు. పోలీసు అధికారులకు కూడా వీటిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్‌, లేదంటే జైలులో డిస్ ప్లే బోర్డులు, అవుట్ డోర్ హోర్డింగులను ఏర్పాటు చేయడం ఈ దశలో ఓ ముందడుగు అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఉచిత న్యాయ సేవల కోసం ఎన్ఏఎల్ఎస్ఏ రూపొందించిన మొబైల్ యాప్ ను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ యాప్ పేదలు, అవసరంలో వున్న ప్రజలకు న్యాయసేవను ఉచితంగా అందిస్తుందని అన్నారు. బాధితులకు నష్టపరిహారాన్ని కూడా అందజేస్తుందని ఎన్వీ రమణ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles