Assam Woman Caught Man Who Groped Her On Street అక్కడ నొక్కిన యువకుడికి గట్టిగా బుద్దిచెప్పిన యువతి

Brave assam woman drags man his scooty down a drain after he gropes her in public

Bhavna Kashyap, crime against woman, woman groped, Facebook, Madhusana Rajkumar, Sinaki Path, sexual outburst, aggression, groped privates, brave woman, crimes against women, Groping, Guwahati, man gropes woman, Sexual assault, sexual harassment, Assam, crime

A man who groped a woman in broad daylight in Assam's Guwahati was caught after she held on to his scooty, lifted its rear tyre and dragged it into a ditch to stop him from driving off. The woman, Bhavna Kashyap, has detailed the incident in a Facebook post.

ITEMVIDEOS: అక్కడ నొక్కిన యువకుడికి గట్టిగా బుద్దిచెప్పిన యువతి

Posted: 08/02/2021 03:59 PM IST
Brave assam woman drags man his scooty down a drain after he gropes her in public

దారి తప్పిన పోకిరీ యువకులు ఎక్కడైనా ఉంటారు. వారితోనే యువతులు అభధ్రతా భావానికి కూడా గురవుతుంటారు. దారుణమైన కామెంట్లు.. వెంటపడి అల్లరి చేయడం.. ఈలలు వేయడం.. ఇవన్నీ పోకిరి చేష్టలే. వీరి బారి నుంచి తప్పించుకునేందుకు యువతులు, మహిళలు ఎన్నెన్ని వ్యూహాలో పన్నాల్సి వస్తుంది. అయితే వీరు పోకిరీలు అని తేటతెల్లమైయ్యేలా వీరి చేష్టలు, వేషాధారణ బట్టి పసిగట్టే ఆడపడచులు.. వారు తిష్ట వేసిన రోడ్డు కాకుండా పక్కనున్న రోడ్డుపై నుంచి కూడా వెళ్లి తప్పించుకుంటారు. అయితే ఇలా కాకుండా తాము ఎంతో సౌమ్యులం అని భావించే మేక వన్నే పులులతోనే ఆడపడచులకు ఎంతో కష్టం.

వారెలా వుంటారో.. ఎలా వ్యవహరిస్తారో.. ఎప్పుడేం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల మధ్య అనునిత్యం అప్రమత్తంగా వుండాల్సిన పరిస్థితి అడపడచులది. తాజాగా ఓ యువతికి ఇలాంటి తేనె పూసిన కత్తిలాంటి యువకుడితో అనూహ్యమైన ఘటనను ఎదుర్కోంది. ఓ యువ‌కుడు న‌డిరోడ్డుపై అడ్ర‌స్ పేరుతో అమె పట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ ఘటనతో షాక్ కు గురైన యువతి అతడికి గట్టిగానే బుద్ది చెప్పింది. ఇలా వచ్చి అలా అమె చాతిని గట్టిగా నోక్కి.. అంతే వేగంగా దసుకెళ్తామనుకున్నాడు. కానీ షాక్ నుంచి తేరుకున్న యువ‌తి ప్రతిచర్యతో ఖంగుతిని కటకటాలు లెక్కబెడుతున్నాడు. ఈ ఘ‌ట‌న అసోంలోని గువ‌హ‌టిలో చోటు చేసుకుంది.

అసోంకు చెందిన భావ‌న క‌శ్య‌ప్ సాయంత్రం రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా.. స్కూటీపై వ‌చ్చిన ఓ యువ‌కుడు రోడ్డుకు అవతలి వైపు నుంచి సినాకి పాత్ ఎక్క‌డ అని ఆమెను అడిగాడు. తనకు వినిపించకపోవడంతో అమె అతడ్ని చూసి ఏమో అంటూ వెళ్లింది. దీంతో ఆ వాహ‌న‌దారుడు తన వాహనాన్ని యువ‌తి వైపు మళ్లించి అమె ముందు ఆపాడు. త‌న‌కు తెలియ‌దు.. మ‌రెవ‌రైననా అడిగండి? అని తెలుపుతున్న క్రమంలోనే అమె చాతిని తన చేతులతో గట్టిగా నోక్కాడు. ఏం జ‌రుగుతుందో తెలియని యువతి షాక్ కు గురైంది. ఈ క్రమంలో తన స్కూటీతో పారిపోయేందుకు యత్నించాడు.

ఈ అనూహ్య ఘటన నుంచి వెంటనే తేరుకున్న యువతి.. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా.. ఆ కామాంధుడిని గ‌ట్టిగా ప‌ట్టుకుంది. స్కూటీని ముందుకు వెళ్ల‌నివ్వ‌కుండా.. త‌న శ‌క్తినంతా ఉప‌యోగించి వెనుక టైర్‌ను గ‌ట్టిగా ప‌ట్టుకోవ‌డంతో అది ముందుకు వెళ్ల‌లేక‌పోయింది. మొత్తానికి ఆ స్కూటీని ప‌క్క‌నే ఉన్న మురికి కాల్వ‌లోకి తోసేసింది బాధిత యువ‌తి. దీంతో అక్కడికి చేరుకున్న మరికొందరు అగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు యువ‌తి భావ‌న క‌శ్య‌ప్ మాట్లాడుతూ.. ఇప్పుడు అత‌న్ని తాను వ‌దిలేస్తే ఇలానే మ‌రికొంత మంది మ‌హిళ‌ల‌ను వేధించే అవ‌కాశం ఉంద‌న్నారు.

అసోం రాష్ట్రం మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు నెల‌వైన ప్రాంతం అని అనుకునే వాళ్లం. ఉత్త‌ర భార‌త్‌లోని రాష్ట్రాల్లో హీన‌మైన నేరాలు జ‌రుగుతాయి. అలాంటి ఘ‌ట‌న‌లు అసోంలో చోటు చేసుకోక‌పోవ‌డంతో ప్ర‌శాంతంగా ఉంటున్నామ‌ని అనుకున్నాం. కానీ ఇలాంటి యువ‌కుల వ‌ల్ల మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయే అవ‌కాశం ఉంద‌ని అందోళన వ్యక్తం చేశారు. కాగా ఘ‌ట‌నస్థలికి చేరకున్న పోలీసులు యువ‌కుడిని అదుపులోకి తీసుకుని.. భావ‌న ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆడది అబల కాదు.. సబల అని ఈ ఘటనతో మారుమారు భావన కశ్యప్ నిరూపించుకుందని నెట్ జనులు అమెను ప్రశంసిస్తున్నారు. అమెలోని ధైర్యానికి, పోరాట పటిమపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh