Mumbai's Borivali Society paints'No Kissing Zone' ముంబైలో ‘‘నో కిస్సింగ్ జోన్’’.. అగిపోయిన చుంబనాలు.. .

No kissing zone mumbai s housing society paints sign to restrict couples

Borivali, couples, intimate, Kissing, Mumbai, no-kissing zone, PDA, Satyam Shivam Sundaram society, Forbidden to Kiss, No Kissing Zone, Pintop, Satyam Shivam Sundaram Housing Society, Mumbai, Maharashtra, Crime

Mumbai’s Borivali, housing society has made it clear that it can’t tolerate public display of affection. It’s for this reason that the residents of the Satyam Shivam Sundaram society put a sign saying “No Kissing Zone” outside their colony to prevent couples getting intimate, mid-day reported.

ముంబైలో ‘‘నో కిస్సింగ్ జోన్’’.. అగిపోయిన చుంబనాలు..

Posted: 08/02/2021 04:41 PM IST
No kissing zone mumbai s housing society paints sign to restrict couples

కరోనా కాలంలో కంటైన్మెంట్ జోన్ల గురించి దేశ ప్రజలందరికీ బాగా తెలిసింది. ఈ జోన్ పరిధిలో కరోనా కేసులు వున్నాయని తెలుపుతూ మున్సిపల్ అధికారులు ఈ జోన్లను ఏర్పాటు చేశాయి. అయితే ఇలానే పలు నగరాలు, పట్టణాల్లో నోస్మోకింగ్‌ జోన్‌, నో హారన్ జోన్ అని కూడా చాలా వున్నాయి. అయితే దేశంలోనే ప్రప్రథమంగా దేశఆర్థిక రాజధాని ప్రాంతంలోని ఓ కాలనీలో నో కిస్సింగ్ జోన్ అని ప్రత్యేకంగా పెట్టారు. ముంబైలోని ఓ హౌజింగ్ సొసైటీ వాళ్లు ఈ జోన్ ను ఏర్పాటుచేసి.. తమ జోన్ వల్ల బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాలు తగ్గాయని సంతోషపడుతున్నారు.

ఇంతకీ ఈ నో కిస్సింగ్ జోన్ గురించి మీకు ఏమైనా తెలుసా.? ముంబైలోని బోరివలి ప్రాంతంలో ఉన్న సత్యం శివం సుందరం సొసైటీ ప్రధాన గేటు వద్ద లాక్‌డౌన్‌ సమయంలో నిత్యం ఎన్నో జంటలు వచ్చి బహిరంగంగా ముద్దులిచ్చుకుంటున్నారు. పలు జంటలకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. వీరి కోసం కాపలాకాయడం సొసైటీ వారికి తలనొప్పిగా తయారైంది. దాంతో ప్రధాన గేటు రోడ్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో ‘నో కిస్సింగ్‌ జోన్‌’ అని రాయించారు. దాంతో బహిరంగ ముద్దులు పెట్టుకోవడం నిలిచిపోయిందని సొసైటీ వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం సరైంది కాదు. హౌజింగ్‌ సొసైటీలోకి రావాలంటే కళ్లు మూసుకుని నడవాల్సి వస్తుంది.

జంటలు ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ఇలా పెద్ద అక్షరాలతో బోర్డు పెట్టాల్సి వచ్చింది’ అని సొసైటీకి చెందిన వారంటున్నారు. కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ఇక్కడ బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాన్ని వీడియో చిత్రీకరించి స్థానిక కార్పొరేటర్‌, పోలీసులకు పంపినా ఫలితం లేకపోయింది. ‘ఇక్కడికి వచ్చే జంటలకు మేం వ్యతిరేకంగా కాదు, అయితే, వారు బహిరంగంగా ఇలాంటి కార్యక్రమాలను పూనుకోవడాన్నే వ్యతిరేకిస్తున్నాం’ అని స్థానిక న్యాయవాది వినయ్‌ అన్సుకర్‌ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన చర్యలకు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులు ఈ బహిరంగ ముద్దుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles