Supreme Court Scolds Kerala Over Bakrid Move ‘వ్యాపారులకు తలొగ్గుతారా.?’’ కేరళ ప్రభుత్వంపై ‘సుప్రీం’ ఫైర్..

Supreme court raps kerala govt for allowing relaxations of covid norms for bakrid

Bakrid, Kerala Bakrid celebrations, Covid relaxations, Bakrid curbs relaxed, Supreme Court, Covid rules, Kerala Covid, Bakrid, Easing of curbs, Kerala Bakra Eid Relaxation, Kerala Eid Relaxation, Kerala Bakra Eid Relaxation, Kerala Eid Relaxation, Kerala Bakra Eid Relaxation Latest News, Politics

The Supreme Court pulled up the Kerala government for allowing a three-day relaxation in Covid-19 restrictions in the state ahead of Bakrid festival, saying the state government bowing to traders’ pressure by granting relaxations shows “sorry state of affairs”

‘‘వ్యాపారులకు తలొగ్గుతారా.?’’ కేరళ ప్రభుత్వంపై ‘సుప్రీం’ ఫైర్..

Posted: 07/20/2021 06:47 PM IST
Supreme court raps kerala govt for allowing relaxations of covid norms for bakrid

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో అమల్లో వున్నా పాన్ డమిక్ ఆంక్షలను మూడు రోజుల మినహాయింపు ఇచ్చిన కేరళ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ వెసలుబాటు కల్పించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారుల డిమాండ్ కు తలొగ్గి ఆంక్షలను సడలిస్తున్నారంటే.. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వాన్ని తీవ్రంగా తలంటింది.

కేరళ ప్రభుత్వం నిర్ణయంపై విస్మయానికి గురిచేస్తోందని మండిపడిన అత్యున్నత న్యాయస్థానం.. వ్యాపారం చేసుకునేవారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రజల ఆరోగ్యంగా జీవించే  హక్కును కాలరాయరాదని హెచ్చరించింది. కరోనా విజృంభనలో దేశంలోనే మహారాష్ట్ర, తమిళనాడు తరువాత కేరళ రాష్ట్రం వుందన్న విషయాన్ని మర్చిపోయారా.? అని ప్రశ్నించింది. ప్రజారోగ్యం కన్నా పండుగలు ముఖ్యమయ్యాయా.? అని నిలదీసింది. ప్రజలు అరోగ్యంగా ఉంటే అదే ప్రభుత్వాలకు పండగా అన్న విషయం తెలియదా.? అని ప్రశ్నించింది.

ఇప్పటికే ఆంక్షల ఎత్తివేత అమల్లోకి వచ్చినందున.. కేరళ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని, కన్వర్ యాత్ర కేసుకు సంబంధించి తామిచ్చిన ఆదేశాలను ఇక్కడా పాటించాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles