జంతు ప్రేమికులకు తమ చుట్టూ పెంపుడు జంతువులు తిరుగుతుంటే వారిలో అదో రకమైన కొత్త శక్తి పునికి పుచ్చుకుంటుంది. అవి ఎంతో ప్రేమగా తమను చూసి తోకను అడిస్తూ రావడంతో వాటికి ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో యజమానులు కూడా వాటితో సరదాగా అడుతుంటారు. ఈ కోవలో ముందువరుసలో వుండేవి మాత్రం విశ్వాసమున్న శునకాలే అంటే అతిశయోక్తి కాదు. అవెప్పుడూ ఫన్ క్రియేట్ చేయడం కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. కాకపోతే రీసెంట్ గా తన పెంపుడు కుక్క కారణంగా ఓ వ్యక్తి దారుణమైన ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాడు.
యజమానులు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా.. బయట నుంచి ఇంటికి వచ్చినా ముందుగా వాహనాన్ని పసిగట్టి ప్రేమతో అరుస్తూ స్వాగతం పలికేవి శునకాలే. చైనాలోని జెజియాంగ్ లో ఉండే లిన్ కు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆయన నోట్లో సిగరెట్ పెట్టుకుని దానిని కాలుస్తూ పార్కింగ్ లాట్ లో వున్న తన కారు వైపుకు వెళ్తున్నాడు. ఇంతలో తన యజమానిని బయటకు రావడం చూసిన శునకం.. పరుగుపరుగున వచ్చి యజమాని పైకి ఎగరాలనుకుంది.
కానీ తడిసిన నేల కారణంగా అది కాస్తా స్లిప్ అయ్యింది. దీంతో వేగాన్ని అపుకోలేక తన యజమాని కాలును ఢీకొనింది. అంతే నిటారుగా వున్న చెట్టంత మనిషీ ఒక్కసారిగా కిందపడ్డాడు. అనూహ్యమైన ఘటనలో కాలికి గట్టి దెబ్బతగలడంతో అక్కడే కూలబడిపోయిన యజమాని మూలుగుతున్నాడు. ఎంతో ప్రేమగా యజమానిని చేరుందుకు వచ్చి శనకం ఒక్కసారిగా కామ్ అయ్యింది. తన మూలంగానే తన మజమాని కిందపడిపోయాడన్న విషయం అర్థమైనట్టుగా.. ఆయన చుట్టూనే తిరిగింది.
వీడియో పోస్టు నెట్టింట్లో పోస్టు చేయడంతో అనేక మంది అనేక రకాల కామెంట్లు పెట్టారు. అయితే అనూహ్యఘటన నుంచి కోలుకున్న తరువాత యజమాని మాట్లాడుతూ.. తనకు శునకంపై ఎలాంటి కోసం లేదని చెప్పాడు. తాను కూడా వీడియోను చూశానని, అది తన వేగాన్ని అదుపుచేసుకోలేక పోవడంతో పాటు కాళ్లు జారడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని, అయితే ఈ విషయం తనకు ముందు తెలియలేదని, వీడియో చూసిన తరువాత విషయం అర్థమైందని అన్నాడు లిన్. ఈ ఘటనతో శనకాలు మనుషుల సంతోషంతో పాటు భాధను కూడా ఇట్టే గహ్రిస్తాయని మరోమారు రుజువైందని అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more