TRS Minister Is Trying To Kill Me: Etela - Etela Rajender నా హత్యకు హంతకముఠాలతో టీఆర్ఎస్ సంప్రదింపులు: ఈటెల

Karimnagar trs leader plotted to kill me claims etela rajender

Etela Rajender, Huzurabad Bypolls, Telangana, TRS, Karimnagar,Telangana, Etela Rajender, trs, Huzurabad Bypoll, Telangana, Politics

In a shocking revelation, BJP leader Etela Rajender claimed that a TRS leader who belongs to the Karimnagar district is plotting to kill him. He further added that the TRS leader has joined his hands with a gang and is sketching out plans to kill him.

నా హత్యకు హంతకముఠాలతో టీఆర్ఎస్ సంప్రదింపులు: ఈటెల

Posted: 07/19/2021 05:41 PM IST
Karimnagar trs leader plotted to kill me claims etela rajender

బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ .. అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ మంత్రి తనను చంపడానికి కూడా కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి హంతక ముఠాతో చేతులు కలిపాడని అరోపించారు. మాజీ మావోయిస్టు నయీం తనను చంపుతానని బెదిరించినప్పుడే తాను భయపడలేదని, ఇక అధికార పార్టీ చిల్లర ప్రయత్నాలకు కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో బెదరబోనని అన్నారు. ఉగ్గుపాలతోనే ఉద్యమాలు చేసిన చరిత్ర తనదని, ఆత్మగౌరవం కోసం ఏస్థాయిలో అయినా పోరాటం చేస్తానని అన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ప్రజాజీవనయాత్ర పేరుతో తన 23 రోజుల పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో తనను ఓడించేందుకు అధికార పార్టీ అన్ని రకాల చర్యలకు దిగిందని అన్నారు. దళిత బంధు పథకాన్ని పెట్టడం సంతోషమేనని... అయితే, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ఈటల ప్రశ్నించారు. దళితుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలను తీసుకురావద్దని అన్నారు.

రేషన్ కార్డులు, పెన్షన్లని ఇప్పుడు ఇస్తున్నది.. ఎన్నికలలో లబ్ది పోందడం కోసమే కదా.? వీటి కోసం తాను ఎన్నో పర్యాయాలు అడిగినా పట్టించుకోని మాట నిజం కాదా అని నిలదీశారు. ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను ప్రజల మధ్యకు తీసుకొచ్చింది మనమేనని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో వచ్చిన ఫలితమే హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా వస్తుందని ఈటల జోస్యం చెప్పారు. తన ఇంటికి వచ్చిన వారిని ఏ కులం, ఏ మతం అని తాను ఏనాడూ అడగలేదని... ఏం కష్టం వచ్చిందని అడిగి సహాయం చేశానని అన్నారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని... అయితే ప్రజలు తనకు అండగా నిలిచారని చెప్పారు.

ఇప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలు తనకు అండగానే ఉన్నారని అన్నారు. పోలీసులు వారి విధులను సక్రమంగా నిర్వహించాలని ఈటల కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గూండాగిరి చేస్తోందని ఈటల మండిపడ్డారు. పాదయాత్రకు అనుమతులు తీసుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన సంస్కృతికి ఇలాంటి ఘటనలు నిదర్శనాలని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు, అహంకారపు పాలనకు ఈ పాదయాత్ర నుంచే చరమగీతం పాడుతామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  Telangana  TRS  Karimnagar  Etela Rajender  trs  Huzurabad Bypoll  Telangana  Politics  

Other Articles