BJP Lost In Bengal Due To "Overconfidence": Suvendu Adhikari అతివిశ్వాసం వల్లే ఓటమన్న సువేందు.. తిప్పికోట్టిన టీఎంసీ

Bjp lost bengal elections due to overconfidence among leaders says suvendu adhikari

Bengal Polls, Suvendu Adhikari, BJP Leaders, Ground work, smuggness, Over Confidence, Mamata Banerjee, Trinamool Congress, high profile campaign, PM Modi, Amit Shah, JP Nadda, West Bengal, Politics

Leader of Opposition in the Bengal Assembly and BJP leader Suvendu Adhikari said the BJP lost because of several leaders' overconfidence that the party would get over 170 seats. At a party meeting in Chandipur area of Purba Medinipur district, Mr Adhikari said this smugness and overconfidence led to lack of understanding of the emerging ground situation.

అతివిశ్వాసం వల్లే ఓటమన్న సువేందు.. తిప్పికోట్టిన టీఎంసీ

Posted: 07/19/2021 04:49 PM IST
Bjp lost bengal elections due to overconfidence among leaders says suvendu adhikari

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజేపి) ఓటమి పాలు కావడానికి పార్టీకి చెందిన కొందరు నాయకుల మితిమీరిన ధీమ, విశ్వాసమే కారణమని బీజేపి శాసనసభాపక్ష నేత సువేందు అధికారి అన్నారు. ఎన్నికలలో తమ పార్టీ తరపున బరిలోకి దిగిన అనేక మంది అభ్యర్థులు ప్రచారానికి ప్రాముఖ్యత ఇచ్చారని, అయితే అదే స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయడం మర్చిపోయారని, దీంతోనే తమ పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యిందని సువేందు అధికారి అభిప్రాయపడ్డారు.

పూర్వ మెడినిపూర్ జిల్లాలోని చండీపూర్ లో జరిగిన ఓ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపి ఓటమికి సోంత పార్టీ నేతలే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదెలా అందుకు కారణాలను కూడా వివరించారు. తొలి రెండు విడతల పోలింగ్ లో బీజేపీకి  భారీ మద్దతు లభించిందని ఆయ‌న చెప్పారు. ఈ కార‌ణంగానే బీజేపీ నేత‌లు కొంద‌రు అతి విశ్వాసం, అతి తెలివి ప్రదర్శించారని ఆయ‌న విమర్శించారు. బీజేపీ దాదాపు 180 సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు కూడా వేనుకున్నార‌ని, దీంతో క్షేత్రస్థాయిలో పని చేయడంలో నిర్లక్ష్యం వహించారని, అందుకే బీజేపీ ఓడిపోయింద‌ని చెప్పుకొచ్చారు.

కాగా సువేందు అధికారి వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మండిపడ్డారు. సోంత పార్టీ నేతలను వ్యాఖ్యలు చేసి.. ఓటిమి నైతిక బాధ్యత వహించాల్సిన మీరే తప్పించుకోవాలని చూడటం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ 170 నుంచి 180 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని సువేందు అనేక పర్యాయాలు చెప్పిన విషయాన్ని ఆయన మర్చిపోయినట్లు వున్నారని ఎద్దేవా చేశారు. బీజేపి నేతలను పగటి కలలు కనేలా చేసిందే సువేందు అని వ్యంగోక్తులు విసిరారు. బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం తమ ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతూ అనేక పథకాలను తీసుకోచ్చారని అన్నారు.

కాగా తృణముల్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగానే కాకుండా అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అత్యంత కీలక పాత్రను పోషించిన సువేందు అధికారి ఇటీవల బీజేపి పార్టీలో చేరి ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి పోటీగా నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఇక్కడ గెలుపు ఓటములు దోబుచులాడిన తరువాత ఎట్టకేలకు సువేందు అధికారి.. మమతా బెనర్జిని ఓడించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం భారతీయ జనతా పార్టీని.. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఓడించింది. దీంతో అమె మరోమారు బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను కూడా చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengal Polls  Suvendu Adhikari  BJP Leaders  Ground work  smuggness  Over Confidence  West Bengal  Politics  

Other Articles