Rajinikanth Shuts Doors To Politics, Dissolves His Outfit రాజకీయాల్లోకి రానని తేల్చిచెప్పాన రజనీకాంత్.. పార్టీ రద్దు.!

Rajinikanth dissolves rajini makkal mandram says no plans of entering politics in future

Rajinikanth, Rajinikanth dissolves Rajini Makkal Mandram, Rajini Makkal Mandram fans association, Rajinikanth, Rajini Makkal Mandram, fans association, rajini makkal mandram, rmm, rajni tamil politics, Tamilnadu, Politics

Putting an end to speculations of his re-entry into politics, Rajinikanth on Monday dissolved the Rajini Makkal Mandram (RMM). Announcing the decision to dissolve RMM, the superstar said the outfit will be revamped as a fans’ welfare association.

రాజకీయాల్లోకి రానని తేల్చిచెప్పాన రజనీకాంత్.. పార్టీ రద్దు.!

Posted: 07/12/2021 05:42 PM IST
Rajinikanth dissolves rajini makkal mandram says no plans of entering politics in future

రాజ‌కీయ ఎంట్రీపై వ‌స్తున్న ఊహాగానాల‌కు సినీనటుడు తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తెరదించారు. తాను స్థాపించిన రజనీ మక్కల్ మండ్రాన్ని ర‌ద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, కొన్నేళ్ల క్రితం కొన‌సాగిన త‌న అభిమాన సంఘం మాదిరిగా ర‌జ‌నీ అభిమాన సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాని ద్వారా త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాబోన‌ని తేల్చిచెప్పారు. భ‌విష్య‌త్తులోనూ రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న‌కు అలాంటి ఉద్దేశం లేద‌న్నారు.

ఇవాళ ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం కార్యవర్గ సభ్యులతో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో స‌మావేశం జ‌రిపిన అనంత‌రం ఈ మేరకు ఆయన క్లారిటీ ఇచ్చారు. మ‌క్క‌ల్ మండ్రంను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తలైవా ప్ర‌క‌టించారు. ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు గ‌త ఏడాది చెప్పిన త‌లైవా.. ఇవాళ అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మంద్రం ఆఫీసు బేర‌ర్ల‌తో భేటీ అయ్యారు. 70 ఏళ్ల ర‌జ‌నీకాంత్ గ‌త ఏడాది రాజ‌కీయ పార్టీ ఆవిష్క‌రించే దిశ‌గా అడుగులు వేశారు.

త‌మిళ‌నాడులో ఇటీవ‌ల‌ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన ర‌జనీ కాంత్ అనంత‌రం అనారోగ్యానికి గురవడంతో 2020 డిసెంబ‌ర్లో ఆ ఆశ‌ల‌పై నీళ్లు పోశారు. పొలిటిక‌ల్ పార్టీ స్టార్ట్ చేయ‌డం లేద‌ని చెప్పారు. ఆరోగ్యం రీత్యా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌నుకున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా చికిత్స‌ త‌ర్వాత అమెరికా వెళ్లి కొంత విశ్రాంతి తీసుకున్న ర‌జ‌నీ మ‌ళ్లీ ఇటీవ‌ల చెన్నై చేరుకున్నారు. అయితే రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ కావ‌డం లేద‌ని ఇవాళ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles