Telangana Congress leader falls off bullock cart during protest ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన..

Congress hold dharnas protesting against hike in petrol lpg prices in telangana

telangana protest, telangana leader falls off bullock cart, Telangana Congress, state congress, Damodar Rajanarasimha, damodar raja narasimha bullock cart, damodar raja narasimha felldown, Congress party, Telangana, Politics

Protesting against the hike in Petrol and LPG prices , Congress party held dharnas across the state. In Hyderabad, the Congress leaders led by Telangana Pradesh Congress Committee (TPCC) Working President Anjan Kumar Yadav held a dharna at Indira Park. Congress senior leader and former deputy chief minister of united Andhra Pradesh, Damodar Rajanarasimha sustained minor injuries as he fell from a bullock cart during protest against fuel prices hike.

ITEMVIDEOS: ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన.. కిందపడిన రాజనర్సింహా

Posted: 07/12/2021 04:49 PM IST
Congress hold dharnas protesting against hike in petrol lpg prices in telangana

దేశంలో చమురు ధరలు పైపైకి వెళ్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ప్రభత్వానికి, పన్నుల భారాన్ని మోపుతూ ఆదాయాన్ని పెంచుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మెదక్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతోన్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర‌స‌న తెల‌ప‌డానికి పీసీసీ కొత్త‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఎడ్లబండి మీద వచ్చారు. అయితే, ధర్నాకు అనుమతి లేదంటూ  పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి యత్నించడంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.

ఈ సందర్భంగా పలువురు ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఇందిరా పార్క్‌, ధర్నా చౌక్‌ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత రావు, ఇతర మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరోపక్క, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌తో పాటు రాములు నాయ‌క్, ఫిరోజ్ ఖాన్ ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు కూడా హైద‌రాబాద్‌లో మరోచోట నిర‌స‌న‌లో పాల్గొన్నారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. నిర్మ‌ల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..  ఏలేటి మహేశ్వర్ రెడ్డితో క‌లిసి పాద‌యాత్ర చేస్తున్నారు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోనూ పెట్రోల్ ధ‌ర‌ల పెంపున‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఆందోళ‌న‌కు దిగింది. ఎడ్ల‌బండ్ల‌తో పాటు సైకిళ్లతో కాంగ్రెస్ నేత‌లు ర్యాలీ నిర్వ‌హించారు. పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ  వికారాబాద్  జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సైకిల్, బండి ర్యాలీలు నిర్వ‌హించారు. ఈ నిర‌స‌న‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఎడ్లబండ్లు ఎక్కి అక్క‌డి కాంగ్రెస్ నేత‌లు నిరస‌న తెలిపారు.

నిరసనలో అపశృతి.. ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ దామోదర

కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నాచౌక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ నిరసన కార్యక్రమాల్లో ఎడ్లబండ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ ప్రసంగిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురై, బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో వైద్యులు చికిత్స అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles