Three girls fighting on street video goes viral ఎమ్మార్పీ ధరలపై జీఎస్టీ వేసిన స్విగ్గీ.. దూలతీరింది..

Swiggy fined rs 20k for levying rs 4 5 gst on soft drink bottles

Abhishek Garg, Sector 2, La Pino’z Pizza, District Consumer Disputes Redressal Commission, food delivery platform Swiggy, Panchkula, cool drinks, Twitter, Haryana

The District Consumer Disputes Redressal Commission, Panchkula, has imposed a fine of Rs20,000 on popular food delivery platform Swiggy for levying Rs4.50 GST on the MRP of three soft drink bottles from a city-based customer.

ఎమ్మార్పీ ధరలపై జీఎస్టీ వేసిన స్విగ్గీ.. దూలతీరింది..

Posted: 07/10/2021 12:41 PM IST
Swiggy fined rs 20k for levying rs 4 5 gst on soft drink bottles

ఆన్ లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీకి షాక్ తగిలింది. నాలుగున్నర రూపాయలను కస్టమర్ నుంచి అక్రమంగా లాగిన స్విగ్గీకి ఏకంగా ఇరవై వేల రూపాయల మేర ఫైన్ పడటంతో దూల తీరింది. అంతేకాదు.. నాలుగున్నర రూపాయలను కూడా 9శాతం వడ్డీతో తిరిగి కస్టమర్ కు చెల్లించాలని కన్జూమర్ కోర్టు తీర్పును వెలువరించింది. ఇదంతా కస్టమర్ నుంచి అక్రమంగా జీఎస్టీ వసూలు చేసిన ఫలితం. అనవసరంగా పన్ను విధించడమే కాదు.. వినియోగదారుడిని మానసిక వేధనకు గురి చేసినందుకు వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పంచకులకు చెందిన అభిషేక్‌ గార్గ్‌ స్విగ్గీ మొబైల్‌ యాప్‌ ద్వారా చీజ్‌ గార్లిక్‌ స్టిక్‌, మూడు సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఆర్డర్‌ చేశారు. గార్లిక్‌ స్టిక్‌కి రూ. 144 కాగా.. కూల్‌డ్రింక్స్‌కి రూ.90. బిల్‌ మాత్రం సాఫ్ట్‌డ్రింక్స్‌కి ప్రత్యేకంగా రూ. 4.50 GST వేసింది స్విగ్గి.. కొన్న వస్తువులపై ఎమ్మార్పీ చెల్లించిన తర్వాత ప్రత్యేకంగా కూల్‌డ్రింక్‌‌పై GST వసూలు చేసినట్టు గమనించాడు. కన్సుమర్‌ గూడ్స్‌ యాక్ట్‌ 2006 ప్రకారం.. చట్ట విరుద్ధమని పంచకుల వినియోగదారుల ఫోరాన్ని బాధితుడు ఆశ్రయించాడు.


మధ్యవర్తులమేనని, సాఫ్ట్ డ్రింక్‌ అమ్మకందారు పాలసీకి అనుగుణంగానే జీఎస్టీ వసూలు చేసినట్టు వివరణ ఇచ్చింది. తమ సర్వీసుల్లో లోపం లేదంటూ పేర్కొంది. స్విగ్గీ వాదనలు విన్న ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్విగ్గీ ఏ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కాదని, వినియోగదారు, అమ్మకందారుల మధ్యవర్తిగా డెలివరీ పనులు నిర్వహిస్తోంది. చట్ట విరుద్ధంగా సాఫ్ట్‌డ్రింక్‌పై జీఎస్టీ రూ. 4.50 వసూలు చేయడాన్ని తప్పు పట్టింది. అదనంగా రూ.4.50 పైసలు 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు, ఇతర ఖర్చుకుగాను అభిషేక్‌ గార్గ్‌కి పదివేలు చెల్లించాలని, పొరపాటుకు జరిమానాగా మరో పదివేలు హర్యానా స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చైల్డ్‌ వేల్ఫేర్‌కి డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhishek Garg  Swiggy  La Pino’z Pizza  District Consumer Court  Fine  Panchkula  Haryana  

Other Articles