COVID-19: Natural Immunity Lasts For Months: Pune Study కరోనా నుంచి కోలుకున్నవారిలో రీఇన్ ఫెక్షన్ తక్కువ..

Covid 19 reinfections rare natural immunity lasts for months pune study

covid-19, Coronavirus, Reinfection, rare, covid re-infections, immunity lasting in those who contracted Covid-19, pune study, DY Patil Medical College, epidemiologists, community medicine experts, SARS-CoV-2 antibodies, PLOS Medicine

Reinfection among people who have recovered from COVID-19 is rare and natural immunity after illness lasts around nine months, a study involving long term follows up of more than 1,000 people in Pune has found.

కరోనా నుంచి కోలుకున్నవారిలో రీఇన్ ఫెక్షన్ తక్కువ.. యాంటీబాడీలే శ్రీరామరక్ష..

Posted: 07/10/2021 01:43 PM IST
Covid 19 reinfections rare natural immunity lasts for months pune study

కరోనా వైరస్ సోకి కోలుకున్న వారికి తిరిగి కరోనా సంక్రమించే అవకాశాలు అత్యంత అరుదని ఇప్పటికే అనేక అద్యయనాలు స్పష్టం చేస్తుండగా, తాజాగా మరో స్టడీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కరోనా సోకి చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ అది దరిచేరే అవకాశాలు తక్కువగా ఉండటానికి కారణం వారిలో సహజ ఇమ్యునిటీ దీర్ఘకాలం ఉండే అవకాశముందని ఈ అధ్యయనం తెలిపింది. దేశంలో కరోనా కలకలం రేపిన ఏడాది నుంచి వీరు మహమ్మారి నుంచి చికిత్స చేయించుకుని కోలుకున్నవారిపై అధ్యయనం చేశారు.

పూణేలోని డాక్టర్ డీవై పాటిల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి చెందిన ఎపిడమాలజిస్టులు మరియు కమ్యూనిటీ మెడిసిన్ నిపుణుల బృందం..కోవిడ్ నుంచి కోలుకున్న 1018 పూణే వాసులను గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఏకంగా పది నెలల పాటు ట్రాక్ చేస్తూ వచ్చింది. ఈ పది నెలల అధ్యయన కాలంలో.. మొత్తం 1018లో కేవలం 13 మంది మాత్రమే రెండోసారి కోవిడ్ బారిన పడ్డారు. అయితే వారు కరోనా బారిన పడటానికి గల కారణాలపై కూడా విశ్లేషణ సాగుతోంది. ఇదిలావుండే రీ ఇన్ఫెక్షన్ రేటు కేవలం 1.2శాతంగా ఉందని అధ్యయనం పేర్కొంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండోసారి కోవిడ్ సోకిన 13మందిలో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని,  వారు చాలాత్వరగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు కలిగి ఉండి..తక్కువ సంఖ్యలో కోవిడ్ డోసులు కలిగి ఉన్న దేశాలకు ఇటువంటి అధ్యయనాలు ముఖ్యమైన సూచనలు తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు కోవిడ్ సోకనివారికి-సహజ ఇమ్యూనిటీ లేని వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రియారిటీ ఇవ్వడం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రభుత్వం హార్డ్ ఇమ్యూనిటీని త్వరగా సాధించేందుకు సాధ్యపడుతుందని తెలిపారు.

సహజ ఇమ్యూనిటీ వల్ల కోవిడ్ నుంచి కోలుకున్న వారిని వ్యాక్సిన్ పోగ్రామ్ క్యూలో చివర ఉంచాలని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎపిడమాలజిస్ట్ అమితవ్ బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సీరో సర్వే, తాజాగా పీఎంఆర్ సర్వేతో కలిపి..70-80శాతం మంది జనాభాలో ఐజీసీ యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కాబట్టి మనం మిగిలిన 20-30శాతం మందిపై ఫోకస్ పెట్టాలని దీని వల్ల చాలా వనరులు ఆదా అవుతాయని, అదే సమయంలో 100 శాతం జనాభా స్థాయి ఇమ్యూనిటీని సాధించేందుకు సాయపడుతుందని బెనర్జీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covid-19  Coronavirus  Reinfection  SARS-CoV-2 antibodies  PLOS Medicine  pune study  

Other Articles