A Two Rupee Coin Can Get You Rs 5 Lakh పాత రూ.5 నోటు వుందా..? రూ.30 వేలు మీ సొంతం..

Get rs 30 000 in exchange of 5 rupee note here s how

Rs 5 note, coin, currency, two rupee coin, old two rupee coin, 2 rupee coin sell, 5 rupee note, old 5 rupee note, 5 rupee note with tractor, 3 rupee coin auction, old 10 rupee note, Quikr

If you have an old Rs 5 note, you are in some luck. In exchange of one note, you can earn up to Rs 30,000. The two-rupee coin that can get you as much as Rs five lakh, is being sold on classified advertisement platform Quikr. Buyers on the Bangalore-based website are ready to shell out a hefty amount in exchange for the old coin.

పాత రూ.5 నోటు వుందా..? రూ.30 వేలు మీ సొంతం..

Posted: 07/05/2021 03:30 PM IST
Get rs 30 000 in exchange of 5 rupee note here s how

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాట మరోమారు రుజువు అవుతోంది. పాతబడే కొద్దీ కొన్నింటికి విలువ పెరుగుతుంది. ఇప్పటికే యాంటిక్ వస్తువులుగా ఎన్నో పాతకాలం నాటి వస్తువులకు గిరాకీ పెరిగింది. ఇక ఇప్పటికే పలు నెంబర్లు వున్న పాత కాలం నాటి కరెన్సీ నోట్లకు, పాత నాణెలకు కూడా డిమాండ్ లభిస్తోంది. ఇక ఇప్పటికే పాత నాణేలు, కరెన్సీ నోట్లు ఆన్ లైన్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నాణెలు, నోట్లు… వేలు, లక్షలు పలుకుతున్నాయి. ఇప్పుడు తాజాగా పాత ఐదు రూపాయల నోటకు కూడా గిరాకీ పలికింది. మీ దగ్గర పాత 5రూపాయల నోటు ఉందా? అయితే మీరు రూ.30వేలు గెలుచుకోవచ్చు.

ఐదు రూపాయల నోటుకు ముఫై వేలు ఇస్తారా.? అంటే ఔననే అంటోంది ఓ వెబ్ సైట్. అయితే ఓ షరత్తు కూడా పెట్టింది. ఏంటా కండీషన్ అంటే పాత ఐదు రూపాయల నోటు వెనకాల ట్రాక్టర్ బొమ్మ ఉండాలట. అలాంటి పాత 5 రూపాయల నోటు మీ దగ్గరుంటే రూ.30వేలు మీ సొంతం అవుతాయి. వెబ్ పోర్టల్ కాయిన్ బజార్.కామ్(coinbazzar.com) ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ పోర్టల్ లో పాత నోట్లను వేలం వేస్తారు. వేలంలో వాటిని కస్టమర్లు కొనుగోలు చేస్తారు. ఇక.. మీ దగ్గర పాత పది రూపాయల నాణెం దానిపై మాతా వైష్ణో దేవి బొమ్మ ఉందా? ఇలాంటి కాయిన్ మీ దగ్గరుంటే లక్షల రూపాయలు గెల్చుకోవచ్చు.

1977-1979కి చెందిన పాత రూపాయి నోటు ఉంటే.. దానికి రూ.45వేలు గెలుచుకోవచ్చు. అయితే ఆ నోటుపై ఫైనాన్స్ మినిస్ట్రీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరూబాయ్ పటేల్ సిగ్నేర్ ఉండాలి. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో హీరూబాయ్ పటేల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. మీ దగ్గరున్న పాత నాణెలు, నోట్లకు డబ్బు గెలుచుకోవాలంటే… ముందుగా కాయిన్ బజార్ డాట్ కామ్ వెబ్ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. పేరు, ఈ-మెయిల్, అడ్రస్ పొందుపరచాలి.

ఆ తర్వాత మీ దగ్గరున్న కాయిన్ లేదా నోటు బొమ్మ తీసి అప్ లోడ్ చేయాలి. ఆక్షన్ లో ఉంచాలి. ఏ వ్యక్తి అయితే మ్యాగ్జిమమ్ బిడ్డింగ్ చేస్తాడో అతడికి ఆ కాయిన్ లేదా నోటు సొంతం అవుతుంది. మరో వెబ్ పోర్టల్ ఇండియామార్ట్.కామ్ (IndiaMART.com) సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తోంది. మీ దగ్గర పాత 25పైసల కాయిన్ ఉంటే.. రూ.1.5లక్షలు గెలుచుకోవచ్చు. అయితే ఆ కాయిన్ సిల్వర్ కలర్ లో ఉండాలి. మీ దగ్గరు అలాంటి కాయిన్ ఉంటే ముందుగా మీరు దాని ఫొటో తియ్యాలి. ఆ ఫొటోని ఇండియా మార్ట్ డాట్ కామ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత వేలం పాట నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 5 note  coin  currency  Rs 10 coin  Rs 2 coin  old two rupee coin  

Other Articles