Third covid wave may start from next month: SBI report వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం.. అక్టోబర్ లో పీక్ స్టేజీకి..

As covid 19 subsides sbi report predicts third wave next month

coronavirus, coronavirus india, coronavirus india news, coronavirus news today, coronavirus news, coronavirus latest news, coronavirus update, coronavirus latest update, coronavirus in india, coronavirus india update, coronavirus india roundup, coronavirus cases in india, coronavirus deaths in india, coronavirus death toll, coronavirus death toll india, corona india update, corona cases in india, coronavirus live, coronavirus india live, corona virus stats country wise, third wave of corona, worldometer coronavirus, worldometer coronavirus india, corona virus data, corona virus live updates, corona virus org, essay on corona virus, worldometers corona virus, when will covid end, 3rd wave of covid in india, covid 19 coronavirus cases delhi

Raising the alarm bells a research report has contended that India may witness the third covid wave from August 2021. The report - COVID-19: The race to finishing line - prepared by SBI Research, claims that the covid third wave peak will arrive in the month of September 2021.

వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం.. అక్టోబర్ లో పీక్ స్టేజీకి..: ఎస్బీఐ రిపోర్ట్

Posted: 07/05/2021 02:54 PM IST
As covid 19 subsides sbi report predicts third wave next month

దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ. క‌రోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. క్ర‌మంగా కొత్త కేసులు తగ్గుతున్నాయి. దాదాపుగా నాలుగు నెలల తరువాత నలభై వేలకు దిగువన దేశంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని ఎస్బీఐ తాజా స‌ర్వే చెబుతోంది. వచ్చే నెల అంటే ఆగ‌స్టులోనే ఈ మూడో వేవ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని త‌న తాజా నివేదిక‌లో హెచ్చ‌రించింది.

కొవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్బీఐ త‌న ప‌రిశోధ‌న నివేదిక‌ను రూపొందించింది. కొవిడ్ థ‌ర్డ్ వేవ్ పీక్ సెప్టెంబ‌ర్‌లో ఉంటుంద‌నీ ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన న‌మోదైంద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం డేటా ప్ర‌కారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు న‌మోదు కావ‌చ్చు. అయితే ఆగ‌స్ట్ రెండో ప‌క్షంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ భారీగా పెర‌గొచ్చ‌ని ఎస్బీఐ రిపోర్ట్ అంచ‌నా వేసింది.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ స‌గ‌టు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో న‌మోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ట్లు గ్లోబ‌ల్ డేటా చెబుతోంది. ఆగ‌స్టు రెండో వారంలో కేసుల సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డం ప్రారంభ‌మై.. నెల‌లోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది. ఇక వ్యాక్సినేష‌న్ల విష‌యానికి వ‌స్తే.. దేశంలో స‌గ‌టున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తున్నారు. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు. వచ్చే నెలలోనే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని, సెప్టెంబర్ లో పీక్ కి వెళ్లనుందన్న ఎస్బీఐ నివేదిక అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  third wave  Third covid wave  SBI  SBI report  

Other Articles