Tirumala Arjita Sevas to begin Online from July శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి ఆర్జిత సేవలు..

Devotees can take part in all arjita sevas online from july

Tirumala Tirupati Devasthanam, Tirumala Budget, YV SubbaReddy, Arjitha seva, Ugadi, Piligrims, Tirumala darshan, Padmavati Temple, Tiruchanoor, APTDC, Piligrims, Tirumala darshan, Tirumala Package, AP Tourism, Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Vada Prasadam, Kalyanam Laddu Prasadam, recommendation letters, SriVari darshanam, Dharma reddy, devotional

Devotees can participate in all Arjita Sevas conducted at Lord Venkateswara Swamy temple in Tirumala online from July. A decision to this effect was taken by the Tirumala Tirupati Devasthanams (TTD) Board of Trustees.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి ఆర్జిత సేవలు..

Posted: 06/30/2021 11:36 AM IST
Devotees can take part in all arjita sevas online from july

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసిన.. ఇల వైకుంఠపురంగా.. భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడికి ఆర్జితసేవలు నిర్వహించేందుకు భక్తులు అసంఖ్యాకంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేవదేవుడికి కూడా నిర్వహించే ఆర్జిత సేవలకు కరోనా మహమ్మారి కారణంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో ఏ నెలకు ఆ నెలరోజుల కోటాను విడుదల చేసే టీటీటీ.. కరోనా కారణంగా అర్థంతరంగా రద్దు చేసింది. అందుకు ప్రభుత్వం విధించిన కర్ప్యూ కూడా కారణమే. కాగా.. ప్రస్తుతం కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరిగి ఆలయధ్వారాలు భక్తలు కోసం తెరుచుకోనున్నాయి.

అంతేకాదు ఆర్జిత సేవా టిక్కెట్లను కూడా భక్తలుకు అందుబాటులోకి తీసుకువచ్చింది తిరుమల తిరుపతి దేవస్టానం బోర్డు. ఇందులో భాగంగా జులై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆన్ లైన్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ప్రత్యక్షంగా కాకుండా, టీవీల ద్వారా వర్చ్యువల్ గా వీటిలో పాల్గొనవచ్చు. కల్యాణోత్సవంతో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఊంజల్ సేవా టికెట్లను అధీకృత వెబ్ సైట్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కల్యాణోత్సవం టికెట్లను పొందిన వారు ఏడాది వ్యవధిలో తమకు ఇష్టమైన రోజున దర్శనానికి వెళ్లవచ్చు. అన్ని సేవా కార్యక్రమాలనూ ఎస్వీబీసీ చానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

అయితే, కల్యాణం టికెట్లు బుక్ చేసుకున్న వారికి దర్శనం మాత్రం జూలై 19 తరువాత మాత్రమే అందుబాటులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కోన్నారు. కాగా, ఇప్పటికే టికెట్లు పోందిన భక్తులు కరోనా కారణంగా రద్దు కాబడిన వారికి తిరిగి అవకాశాన్ని కూడా కల్పించనుంది. ఈ నెల 16వ తేదీన మాత్రం ఆర్జిత సేవలను దేవాలయ బోర్డు కేటాయించలేదు. కాగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనున్న భక్తులు తిరుమల తిరుపతి దేవస్థాన అఫిషియల్ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుని టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదా https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా లాగిన్ అయ్యి ఆర్జిత సేవా టికెట్లను పొందవచ్చునని టీటీడీ బోర్డు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles