Drones spotted again in Jammu and Kashmir మరోమారు జమ్మూలో డ్రోన్ల కలకలం.. సమీక్షించిన కేంద్రం

Three more sightings of drones in jammu security agencies on alert

Jammu drone sightings, drones spotted, drones, Jammu drone attack, Drone threat in India, Drones and terrorism, Jammu air force attack, Jammu attack, Jammu drone, Drone sightings in Jammu, drones, Jammu, Air Force Stations, Srinagar, Midnight, Ratnuchak, kunjwani, Army Brigades, Jammu Kashmir, Crime

Security personnel spotted drones at three separate places in Jammu for the fourth consecutive day on Wednesday. Sources told that drones were seen hovering over Miran Sahib, Kaluchak and Kunjwani areas of Jammu in the wee hours of Wednesday.

మరోమారు జమ్మూలో డ్రోన్ల కలకలం.. సమీక్షించిన కేంద్రం

Posted: 06/30/2021 12:31 PM IST
Three more sightings of drones in jammu security agencies on alert

జమ్ముకశ్మీర్ లోని భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన స్థావరాలపై వరుస డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. అందివచ్చిన అదునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ముష్కరమూకలు జమ్మూలోని ఎయిర్ పోర్స్ సహా సైనిక స్థావరాలపై దాడులకు యత్నిస్తున్నారు. ఇటీవల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుళ్లకు కారణమైన ఈ డ్రోన్లను కూకటి వేళ్లతో పెకిళించడానికి భారత్ అధునాతన సాంకేతిక వ్యవస్థను అమలు చేయనుంది. కాగా గత నాలుగు రోజులుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు డ్రోన్లతో అలజడి సృష్టిస్తున్నారు. అయితే వాటి ఆటను భారత భద్రతా బలగాలు కట్టిస్తునేవున్నాయి. కాల్పులు జరుపుతున్నా అవి చీకట్లో తప్పించుకు తిరుగుతున్నాయి.

తాజాగా మరోమారు గత రాత్రి మరో మూడు డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి. నిన్న అర్ధరాత్రి 1.30 నుంచి ఈ తెల్లవారుజామున 4 గంటల మధ్యలో జమ్మూలోని వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్లు సంచరించాయి. మొదట కాలుచూక్‌ కంటోన్మెంట్ వద్ద ఓ డ్రోన్‌ కన్పించగా.. ఆ తర్వాత కాసేపటికే రత్నచక్‌ సైనిక ప్రాంతంలో మరోదాన్ని గుర్తించారు. ఇక మూడోది.. కుంజ్వానీ ఎయిర్ ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద కన్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిఫెన్స్‌ ఇన్ స్టాలేషన్స్‌ సమీపంలో ఇవి కదలాడినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. జమ్ము సైనిక స్థావరాల వద్ద గత నాలుగు రోజుల్లో మొత్తం ఏడు డ్రోన్లు సంచరించడం గమనార్హం.

ఈ డ్రోన్‌ దాడుల వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మన సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగడం ఇదే ప్రథమం. దీంతో డ్రోన్లు సంచరించిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు అణువణువూ జల్లెడ పడుతున్నాయి. ధాయాది దేశం నుంచి ఉత్పన్నమైన ఈ సరికొత్త ముప్పును తప్పికోట్టేందుకు అత్యాధునిక ఆయుధాలను సైన్యానికి సమకూర్చాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూలో నెలకొన్న తాజా పరిస్థితిని సమీక్షించింది. దేశ భద్రతకు ఏర్పడే కొత్త సవాళ్లను తిప్పకోట్టే క్రమంలో మరింత దృఢమైన చర్యలు తీసుకునే విషయాన్ని చర్చిస్తోందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drones  Jammu  Air Force Stations  Srinagar  Midnight  Ratnuchak  kunjwani  Army Brigades  Jammu Kashmir  

Other Articles