India opens gate for Moderna Covid-19 vaccine భారతీయుల అందుబాటులోకి త్వరలో మరో కరోనా వాక్సీన్..

Cipla gets nod to import moderna covid 19 vaccine in india

moderna, cipla, Covid-19 vaccine, Coronavirus Vaccine, Union Government, Drug controller General of India DGCI, Covaxin, Covisheild, Sputnik-V, Moderna, Covid vaccine, India, Dr Reddys, Cipla, Bharat BioTech, NIV, Serum Institute

India on Tuesday made way for the fourth coronavirus vaccine in its drug baske after Mumbai-based pharmaceutical company Cipla got a nod from India's drug regulator DCGI to import the vaccine for restricted emergency use in the country.

భారతీయుల అందుబాటులోకి త్వరలో మరో కరోనా వాక్సీన్..

Posted: 06/29/2021 05:42 PM IST
Cipla gets nod to import moderna covid 19 vaccine in india

త్వరలోనే భారత్ లోకి మరో కరోనా వ్యాక్సిన్ రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి కోసం మ‌ల్టీ నేష‌న‌ల్‌ ఫార్మాసూటిక‌ల్ కంపెనీ సిప్లా.. చేసుకన్న ధరఖాస్తును పరిశీలించిన డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐ) అత్యవసర వినియోగానికి అనుమతతులు మంజూరు చేసింది. భారత్ లో ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కు చెందిన కొవ్యాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయి.

కాగా, భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఏ తాజాగా మోడెర్నా కరోనా వ్యాక్సిన్ కు కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశంలో ఇప్పటివరకు అందుబాటులో వున్న వాక్సీన్లకు తోడు ఇది జతకలవనుంది. మోడెర్నా వ్యాక్సిన్ కూడా వాటి సరసన చేరిడంతో దేశంలో కరోనాకు మొత్తంగా నాలుగు టీకాలు అందుబాటులో వుండనున్నాయి. మోడెర్నా టీకాను (ఎంఆర్ఎన్ఏ) టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఇది 90శాతానికిపైగా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్న‌ట్లు తేలింది. ఇప్ప‌టికే చాలా ధ‌నిక దేశాల్లో ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తి ల‌భించింది.

దీంతో పాటు ఫైజర్‌ టీకా కూడా అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో అందుబాటులో ఉంది. అమెరికాలో ఫైజ‌ర్‌, మోడెర్నా క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కూ 12కోట్ల మంది రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక ఈ రెండు టీకాలు కలపి తీసుకున్నవారిలో అత్యధిక శాతం యాండీ బాడీలు తయారవుతాయని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇక దీంతో పాటు ఈ రెండు టీకాలు కలిపి తీసుకుంటే జీవితకాలం యాంటీబాడీలు వృద్దిచెందుతాయని కూడా పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అయితే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు అధిక ధ‌ర‌, ఉత్ప‌త్తి ప‌రిమితులు, స్టోరేజీ, షిప్పింగ్ స‌మ‌స్య‌లు వంటివి ఉండ‌టం ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు అడ్డంకిగా మారింది. భారత్‌లోనూ మోడెర్నా, ఫైజర్ టీకాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డీసీజీఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలు దేశంలో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదంది. అయితే విదేశీ కంపెనీలు డిమాండ్‌ చేస్తున్న ఇండెమ్నిటీ రక్షణపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో వీటి రాక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  cipla  corona vaccine  Covid vaccine  DCGI  india  moderna vaccine  

Other Articles