Angry girlfriend sets her ex’s Triumph motorcycle on fire మాజీ ప్రియుడి కాస్ట్లీ బైక్ కు నిప్పుపెట్టి.. రివెంజ్..

Angry girlfriend sets her ex s triumph motorcycle on fire

crazy ex girlfriend, 23 Lakh bike, Gift to boy friend, break-up, revenge on ex boy friend, school officers’ ex-girlfriend, Bangkok South Criminal Court, Thonglor police station, corona pandemic, online classes, elementary level wing, Girl Friend, Ex boyfriend, Girl Friend Revenge, Ex boyfriend bike, Srinakharinwirot University,Thai woman, Triumph bike on fire, Bankok, Thailand, Crime

This is the shocking moment a jilted girlfriend set her ex-boyfriend’s prized Triumph motorcycle on fire. Kanok Wan, 36, was seen in the parking lot of a school and poured gasoline on one of the motorcycles before lighting it on fire in Bangkok, Thailand on June 21. The jealous woman allegedly set fire to the expensive two-wheeler as she wanted to take revenge on her ex for refusing to get back with her.

ITEMVIDEOS: మాజీ ప్రియుడి ఖరీదైన బైక్ కు నిప్పుపెట్టి.. రివెంజ్..

Posted: 06/29/2021 07:04 PM IST
Angry girlfriend sets her ex s triumph motorcycle on fire

ఇరువురు మనుషలు మధ్య సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు ముడిపడతాయో.. ఎప్పుడు తెగదెంపులవుతాయో కూడా ఎవరికీ తెలియని విషయం. కాసింత తెలివైనవారైతే.. తమ రిలేషన్ షిప్ కాపాడుకోవడంలో కొంత తగ్గాల్సివచ్చినా వెనకంజవేయరు. మరికొందరు తననే అలా అంటే ఇక సహించేదెలా అంటూ ఎదుటివారు కోపంలో చేసిన పనులను గుర్తుచేసుకుంటూ బ్రేకప్స్ వైపు అడుగులు వేస్తారు. ఈ తరహా ఘటనలు సర్వసాధారణం. అయితే ఇలా విడిపోయిన జంటలు ఎవరి పనిలో వారు బిజీగా మారిపోతుంటారు. కానీ కొందరు మాత్రం గతాన్ని తలుచుకుని బాధపడుతుంటారు ఇది కూడా వెరీ కామన్.

వీరికి కూడా భిన్నంగా మరికొందరు వుంటారు. తనకే బ్రేకప్ చేప్పేంత ధైర్యం ఎలా వచ్చింది వారికి అంటూ రగిలిపోతుంటారు. తన పాత్ర, ప్రమేయం లేకుండా ఎదుటివారిపై ప్రతీకారం తీర్చుకోవాలాని రగిలిపోతుంటారు. మాజీలపై తమకున్న ప్రేమను కోపంగా మార్చుకుంటారు. తనకు బ్రేకఫ్ చెప్పడాన్ని తట్టుకోలేక ఎలాగైనా వాళ్లపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంటారు. తనతో ఉన్నంతకాలం బాగానే ఉండి.. ఇప్పుడు ముఖం చాటేసిన ప్రియుడికి ఎలా బుద్ధిచెప్పిందో చూడండి ఈ 36ఏళ్ల థాయిలాండ్ యువతి. అయితే బుద్ది చెప్పే క్రమంలో అమె అలోచన.. ముందుజాగ్రత్త పూర్తింగా మందగించి.. కటకటాలను లెక్కబెడతోంది.

తనతో కొన్నాళ్ల పాటు కలిసి ఉన్న ప్రియుడు.. ఇకపై తనతో అదే రిలేషన్ షిప్ కొనసాగించడం ఇష్టంలేక నో చెప్పాడు. అంతే కోపంతో.. అతడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన యువతి.. తాను అక్కరేదన్నప్పుడు.. తాను ఇప్పించిన కానుక ఎందుకు అనుకుని.. కలసివున్నప్పుడు ఇప్పించిన ఖైరీదైన (రూ.23 లక్షల విలువచేసే) బైక్ కూడా వాడకుండా చేయాలనుకుంది. స్థానిక యూనివర్సిటీలోని ఎలిమెంటరీ స్కూలులో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తు్న్న తన మాజీ ప్రియుడు పార్క్ చేసిన బైక్ వద్దకు చేరకున్న అమె.. అనుకున్నదే తడవుగా అతడి విలువైన బైక్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది.

అయితే ఆ బైక్ తో పాటు దాని చుట్టుపక్కల పార్క్ చేసిన మరో ఆరు బైకులు కూడా పూర్తిగా దహనమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై అక్కడి పార్కింగ్ ఏరియాలో వున్నసీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా యువతి బైక్ కు నిప్పుపెట్టిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనలో అమెకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన ఆమె వాటిని అర్పేసుకుంది. అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తరువాత అమె తను వచ్చిన కారులో అక్కడి నుంచి ఏమీ ఎరుగదన్నట్లుగా వెళ్లిపోయింది.

థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెను 36 ఏళ్ల కనాక్ వాన్ గా గుర్తించిన పోలీసులు దక్షిణ బ్యాంకాక్ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ తీసుకెళ్లి అమెను అరెస్టు చేశారు. దీంతో జైల్లో ఊచలు లెక్కపెడుతున్న అమ్మడు.. మన వేమన శతకాలు కూడా తిరగేస్తే మంచింది. అంతేగా తన కోసమె తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష.. అన్న సూక్తులను చిన్నప్పుడే బాగా వంటపట్టించి వుంటే.. పెధ్దయాక ఆచరణ పెట్టేందుకు పనిరకొస్తాయ్. అలా కాకుండా ఉద్రేకం మనిషికి అధిగమించి పనిచేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. సిసిటీవీల్లో రికార్డైన వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles