Man Saves Cobra By Blowing Air Into Mouth Using Straw పాము నోటిలోకి ఊపిరూది ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్

Man saves poisonous 10 foot cobra using straw to blow air in its mouth

Snake, Dangerous animals, Reptiles, Animal Rescue, wildlife, rescue, Snehasish, snake catcher, viral news, Social media, Odisha, video viral, Viral video, India

A man took his own life in his hands when he allegedly saved a deadly 10-foot cobra using only a drinking straw. Video has surfaced in which it appears that an apparent animal lover used a spare straw to help get a snake's breathing to normalize after it was found inside a home in India.

ITEMVIDEOS: పాము నోటిలోకి ఊపిరూది ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్

Posted: 06/22/2021 09:36 AM IST
Man saves poisonous 10 foot cobra using straw to blow air in its mouth

పామును కదలకుండా అపస్మారక స్థితిలో వుంటే సాధారణంగా ఎవరైనా దానిని చూడగానే అమ్మో పాము అంటూ ఆమడ దూరం జరగడం ఖాయం. ఇక మరికొందరు అలా పడి వున్న పామును చూడగానే చిన్నారులు భయపడతారని దానిని కర్ర సాయంతో పొదల్లోకి విసరడం కూడా సాధారణమే. అయితే పాముల గురించి బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే పాములు కూడా అపస్మారక స్థితిలోకి జారుకున్నాయని అర్థమవుతుంది. ఔనా నిజంగానా.? అన్న సందేహాలకు అసలు అసవరమే లేదు. అయిలే అలా అవి ఎందుకని సృహ కోల్పోతాయి అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం కాక మానవు.

పాములు వాటి అహారమైన ఎలుకల కోసం పరుగులు తీసి ఇరుకైన కన్నంలోకి దూరి వాటి ప్రాణాలపైకి తెచ్చుకుంటాయి. అటు ముందుకు కదల్లేక, ఇటు వెనక్కు రాలేక మధ్యలో ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడి అపస్మారక స్థితిలోకి జారుకుంటుంది. ఇలా సృహ కోల్పోయిన పామును చూస్తూ అమ్మో అంటూ స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేస్తాం. ఇంకోందరైతే పామును అనే అరుపు వినబడగానే పొడువైన, గట్టి కర్రను తీసుకువచ్చి దానిని కొట్టి చంపేస్తారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోకి జారుకున్న ఓ పామును తన చేత్తో పట్టుకుని దాని నోట్లుకి ఊపిరూది దానిని బతికించడం ఎందమంది వల్ల అవుతుంది.

ఇలాంటి సాహనం ఎవరైనా చేస్తారా? అసలు ఊహకు కూడా అందడం లేదు కదా? కానీ, ఒడిశాలో జరిగిన ఈ సంఘటన చూస్తే మనకు ఆశ్చర్యం కలగకమానదు. మల్కన్ గిరి జిల్లాకు చెందిన స్నేహాశీష్‌ అనే వ్యక్తి స్థానికంగా స్నేక్ క్యాచర్ (పాములను పట్టుకుంటుంటాడు)గా వ్యవహరిస్తుంటాడు. ఎలుకను వేటాడుతూ ఓ ఇంట్లోకి దూరిన పాము ఓ కన్నంలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న స్నేహాశీష్‌ వెంటనే అక్కడికి చేరుకొని ఆ 10 అడుగుల పామును బయటకు తీశాడు. కానీ, అది అప్పటికే అపస్మార స్థితిలోకి వెళ్లడం గమనించాడు.

అందిరిమాదిరిగా సర్లే పాము దొరికేసింది.. అంటూ దానిని పట్టుకుని ఎక్కడో పారవేయకుండా.. దానికి ఊపిరి ఊది బతికించాలని తలచాడు. అయితే దాని నోట్లోకి ఎలా ఊపిరిని ఊదడం అని అలోచించిన స్నేహశీష్ చుట్టుపక్కల చూడగా.. ఓ స్ట్రా కనపడింది. వెంటనే దాన్ని పాము నోట్లో పెట్టి ఊపిరి ఊదాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత అది స్పృహలోకి వచ్చింది. ఆ పాముకు ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాముకి ప్రాణం పోసిన స్నేహాశీష్‌పై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snake  wildlife  rescue  Snehasish  snake catcher  viral news  Social media  Odisha  video viral  

Other Articles