Hyderabad MMTS services to resume tomorrow ఎంఎంటీఎస్ రైళ్లు: రేపట్నించే అందుబాటులోకి..

Hyderabad mmts trains to resume operations from tomorrow

Corona virus, Lock down 2020, Unlock 2021, Telangana, Kishan Reddy, Union Minister for state Home affairs, Hyderabad MMTS, MMTS, Nampally, Lingampally, Falaknuma, Begumpet, Kachiguda, Secundrabad, passengers, Hyderabad

After a long wait, the Hyderabad MMTS, whose services were suspended following the declaration of a nationwide lockdown in March 2020, will resume from tomorrow. The MMTS ferried around 1.6 lakh passengers daily, while its tickets ranged between Rs 5 and Rs 15, making it affordable for everyone.

రేపట్నించి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు: గతేడాది లాక్ డౌన్ తో దూరం..

Posted: 06/22/2021 10:29 AM IST
Hyderabad mmts trains to resume operations from tomorrow

భాగ్యనగరవాసులకు ఇది శుభవార్తే. కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో గత ఏడాది లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి సేవలకు దూరంగా వెళ్లిన ఎంఎంటీఎస్ రైళ్లు.. మరో రెండు రోజుల వ్యవధిలో ప్రపయాణికులకు సేవలు అందించేందుకు సిద్దం కానున్నాయి. దాదాపుగా 15 నెలల క్రితం ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు కూతకు రెడీ అవుతున్నా నేపథ్యంలో అత్యంత చౌక ధరలతో నగర ప్రయాణాలు చేసేందుకు నగరవాసులు కూడా సిద్దం అవుతున్నారు. రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో వీటిని పట్టాలెక్కించాలని అధికారులు నిర్ణయించారు.

బస్సు, మెట్రో ప్రయాణాలతో పోల్చితే కేవలం ఐదు, పది రూపాయలతో దూర ప్రాంతాలకు నగరవాసులను చేర్చే రవాణ సాధనం ఎంఎంటీఎస్ రైలు. ఈ సాధనం అందుబాటులో లేక ఇప్పటి వరకు ప్రయాణికులు బస్సులతో పాటు ఇతర మార్గాలపై ఆధారపడ్డారు. కాగా బుధవారం నుంచి పది ఎంఎంటీఎస్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అందుబాటులోకి రానున్న రైళ్లలో మూడు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు మూడు, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడవనున్నాయి. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే తొలి రైలు ఉదయం 7.50 గంటలకు బయలుదేరనుండగా, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే తొలి రైలు ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి రైలు ఉదయం 8.43 గంటలకు బయలుదేరనుండగా, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు ఉదయం 9.36 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

47154 ఫలక్ నుమా ఉదయం 07.50 లింగంపల్లి ఉదయం 09.07
47178 లింగంపల్లి ఉదయం 09.20 ఫలక్ నుమా ఉదయం 10.42
47157 ఫలక్ నుమా ఉదయం 10.55 ఉదయం లింగంపల్లి మధ్యాహ్నం 12.20
47181 లింగంపల్లి మధ్యాహ్నం 12.40 ఫలక్ నుమా మధ్యాహ్నం 2 గంటలు
47162 ఫలక్ నుమా సాయంత్రం 4.20 లింగంపల్లి సాయంత్రం 5.45
47188 లింగంపల్లి సాయంత్రం 6.05 ఫలక్ నుమా రాత్రి 7.32
47131 లింగంపల్లి ఉదయం 08.43 హైదరాబాద్ ఉదయం 09.28
47107 హైదరాబాద్ ఉదయం 09.36 ఉదయం లింగంపల్లి ఉదయం 10.21
47141 లింగంపల్లి సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్ సాయంత్రం 6.05
47119 హైదరాబాద్ సాయంత్రం 6.15 లింగంపల్లి రాత్రి 7.05

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad MMTS  MMTS  Nampally  Lingampally  Falaknuma  Begumpet  Kachiguda  Secundrabad  passengers  Hyderabad  

Other Articles